https://oktelugu.com/

Free Movie Download : ఆ వెబ్ సైట్ల నుంచి ఉచితంగా సినిమాలను డౌన్లోడ్ చేసుకుంటున్నారా? అయితే చిక్కుల్లో పడ్టట్లే..

ఓటీటీల హవా పెరిగిపోతున్న సమయంలో కొన్ని వెబ్ సైట్లు ఉచితంగా సినిమాలు అందించం మొదలు పెట్టారు. గతంలో సినిమా రిలీజ్ రోజునే పైరసీ సీడీలు బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఓటీటీలకు సినిమాలు రాగానే కొన్ని వెబ్ సైట్లు ఉచితంగా వీటిని అందిస్తున్నాయి. అయితే ఈ వెబ్ సైట్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Written By:
  • Srinivas
  • , Updated On : September 11, 2024 / 11:47 AM IST

    Free Movie Download

    Follow us on

    Free Movie Download :  కరోనా తరువాత సినిమాల రావడం తక్కువైంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అయితే ఈ సమయంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా ఓటీటీల్లో రిలీజ్ కావడంతో వాటికే అలవాటు పడ్డారు. సినిమా థియేటర్ల కంటే ఓటీటీల ద్వారా సినిమా చూడడం చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా ఒక్క నెల ఛార్జీ చెల్లించి కుటుంబమంతా కలిసి ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు. ఓటీటీల హవా పెరిగిపోతున్న సమయంలో కొన్ని వెబ్ సైట్లు ఉచితంగా సినిమాలు అందించం మొదలు పెట్టారు. గతంలో సినిమా రిలీజ్ రోజునే పైరసీ సీడీలు బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఓటీటీలకు సినిమాలు రాగానే కొన్ని వెబ్ సైట్లు ఉచితంగా వీటిని అందిస్తున్నాయి. అయితే ఈ వెబ్ సైట్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

    కొన్ని కోట్ల రూపాయలతో తీసే సినిమాలను కొందరు తమ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రేక్షకులు అటు థియేటర్లకు వెళ్లలేక.. ఇటు ఓటీటీలో చూడకుండా ఉచితంగా ఈ సినిమాలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇవి మొబైల్ లోనూ.. పీసీల్లోనూ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సులభంగా డౌన్లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

    చాలా మంది సైబర్ నేరగాళ్లు వ్యక్తుల డేటాలను చోరీ చేసేందుకు రకరకాల లింక్స్ పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్ సైట్లు వ్యక్తుల డేటాను సేకరిస్తున్నాయి. ఉచితగా సినిమాలు, ఇతర యాప్ లు డౌన్లో డ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో వారి డేటాను సేకరిస్తున్నారు. ఈ డేటాను ఆ వెబ్ సైట్లు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

    అంతేకాకుండా ఈ వెబ్ సైట్లు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఉచితంగా సినిమాలను వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అటు ప్రేక్షకులు సైతం ప్రభుత్వానికి పరోక్షంగా పన్ను చెల్లించకపోవడంతో భారీగా ఆదాయానికి గండి పడుతుంది. అయితే ఇక్కడ ఉచితం మాయలో పడి చాలా మంది ఈ వెబ్ సైట్లు సినిమాలు డౌన్లోడ్ కావడానికి కొన్ని ఆప్షన్లను ముందుకు తెస్తున్నరు. వీటిలో I Agree అనే బటన్ నమ్మశక్యం కాదని అంటున్నారు. తమ డేటాను ఇతరులకు అందించేలా సెట్ చేసి ఉంచుతారు. అప్పుడు మీకు ఓకేనా? అనే అప్షన్ అడుతుంది. అయితే చాలా మంది ఇది సినిమా కోసం కావొచ్చు అని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఇవి వ్యక్తుల డేటాను సేకరించేందుకే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

    అందువల్ల ఉచితం మాయలో పడి ఏ వెబ్ సైట్లు పడితే వాటిని క్లిక్ చేయకుండా ఉండండి. థియేటర్లో రిలీజ్ అయిన తరువాత కొద్ది రోజులకే ఆ సినిమా ఓటీటీలో వస్తోంది. వీలైతో ఓటీటీలో సబ్ స్క్రైబర్ అయి చూడడం వల్ల అటు సంస్థలకు, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చిన వాళ్లమవుతాం. అంతేకాకుండా నకిలీ వెబ్ సైట్ల మాయలో పడి పర్సనల్ డేటా ఇతరులకు అప్పగించకుండా ఉంటారు