SSi Mantra Robotic Surgery: పాశ్చాత్య దేశాలలో వైద్యరంగం చాలా అభివృద్ధి చెందింది. పైగా అక్కడ టెక్నాలజీ వినియోగం కూడా అధికంగా ఉంటుంది. కానీ మన దేశం విషయానికి వచ్చేసరికి సంపాదనకు అలవాటు పడిన వైద్యులు.. వైద్యరంగంలో సాంకేతికతను పెద్దగా ఇష్టపడరు. సాంకేతికతను జోడించడానికి సుముఖత వ్యక్తం చేయరు. ఇలాంటి సందర్భం రానే వచ్చింది. అది అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యుడు సుధీర్ శ్రీవాత్సవ రూపంలో భారతదేశంలో వైద్యరంగంలో టెక్నాలజీని జోడించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.. సుధీర్ శ్రీవాత్సవ అమెరికాలో స్థిరపడ్డ భారతీయ వైద్యుడు. 2011లో ఆయన ఒక పని మీద మాతృదేశానికి వచ్చారు. ఒక ఆస్పత్రిని విజిట్ చేశారు. ఈ క్రమంలో ఒక యువకుడు నిర్వేదంగా కనిపించాడు. అతడి గురించి సుధీర్ వాకబు చేయగా.. తన ఆవేదనను వ్యక్తం చేశాడు.. తన దగ్గర డబ్బులు లేవని.. తన సోదరికి హృదయ సంబంధిత శస్త్ర చికిత్స చేయించాలని.. తక్కువ ఖర్చులో చేయడానికి ఆసుపత్రి వైద్యులు ఒప్పుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి పరిస్థితి చూసి చదివించి పోయిన సుధీర్ శ్రీవాత్సవ.. ఉచితంగా శస్త్ర చికిత్స చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ ఆ ఆస్పత్రి వైద్యులు ఒప్పుకోలేదు. తీవ్రంగా కలత చెందిన సుధీర్ శ్రీవాత్సవ.. కొద్దిరోజులు ఇదే విషయంపై ఆలోచించారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయి.. కొద్దిరోజుల పాటు అక్కడే ఉండి తాను అన్ని రోజులపాటు పోగు చేసిన డబ్బులు మొత్తం తీసుకొని వచ్చి.. దేశ ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చులో శస్త్ర చికిత్సలు చేయాలని తలచారు. ఇందులో భాగంగానే వైద్యరంగంలోకి టెక్నాలజీని జోడించాలని ఆయన భావించారు.
అభివృద్ధి చెందిన దేశాలలో శస్త్ర చికిత్సలను రోబోలు చేస్తుంటాయి. ఆ విధానాన్ని ఇండియాలో ఎందుకు ప్రవేశ పెట్టకూడదు అనే ప్రశ్న ఆయన మదిని తొలిచింది. దీంతో ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత పదిమంది సైంటిస్టులతో కలిసి సర్జికల్ రోబోను తయారు చేశారు. అనేక ప్రయోగాల తర్వాత ఎస్ ఎస్ ఐ మంత్ర అనే పేరుతో సర్జికల్ రోబోను రూపొందించారు. 2017లో ఇది అందుబాటులోకి వచ్చింది. 2024లో దీనికి అప్రూవల్ లభించింది. ఆ తర్వాత దీని సహాయంతో పూణేలో ఇటీవల సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. చేసిన సర్జరీలు కూడా విజయవంతమయ్యాయి. దీంతో వైద్యరంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత పెంచడానికి సుధీర్ శ్రీవాత్సవ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఈ రోబోల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన వ్యాధులతో బాధపడే రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయాలని భావిస్తున్నారు. ” వైద్యరంగంలో సమూల మార్పులు రావాలి. వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా శస్త్ర చికిత్సలు అత్యంత చవకగా జరగాలి. అవన్నీ జరగాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావాలి. వైద్యరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రావాలని” సుధీర్ శ్రీవాత్సవ పేర్కొంటున్నారు.
View this post on Instagram