Artificial Intelligence: ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాలం.. ప్రతీ రంగంలోకి ఏఐ వేగంగా దూసుకొస్తోంది. కొన్ని దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అనేక కంపెనీలు కొత్తగా లాంచ్ చేస్తున్న మొబైల్ ఫోన్లను ఏఐ ఫీచర్‌లో అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ కూడా ఏఐని తన ఫోన్లలో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో లాంచ్ చేసే ఐఓఎస్18లో ఏఐ ఆధారిత ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్‌ఏఐతో ఒప్పందం చేసుకుంది.
16 సిరీస్‌లో ఏఐ ఫీచర్లు..
ఈ ఏడాది చివరకి యాపల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను లాచ్ చేయబోతోంది. ఇందులో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మార్కెట్‌లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లు ఏఐ ఆధారిత టూల్స్, యాప్స్‌లతో వచ్చాయి. యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనుకబడింది. ఐఓఎస్ 18తో ఆ లోటు తీర్చనుంది. ఈమేరకు ఓపెన్ ఏఐతో అగ్రిమెంట్ దాదాపు ఖరారైంది.
ల్ఫాబెట్‌తో గూగుల్ చర్చలు..
ఇదిలా ఉండగా గూగుల్ కృత్రిమ మేధ చాట్‌బాట్ జెమినికి లైసెన్స్ ఇవ్వాలని అల్ఫాబెట్‌తో చర్చలు జరిపింది. ఇంకా కొనసాగుతున్నాయి. ఒప్పందం మాత్రం జరుగలేదు. వరలో ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో ఓపెన్ ఏఐతో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తాను కూడా వ్యక్తిగతంగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తానని గతంలో చెప్పారు. రానున్న రోజుల్లో యాపిల్ ఉత్పత్తుల్లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించనున్నట్లు తెలిపారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది.