WhatsApp safety tips: ఆదివారం ఉదయం తెలంగాణ మంత్రుల వాట్స్అప్ ఖాతాలు హ్యాక్ అయినట్టు వార్తలు వచ్చాయి. హ్యాకర్లు మంత్రుల వాట్స్అప్ ఖాతాలలోకి ప్రవేశించి.. ఎస్బిఐ పేరుతో హార్మ్ ఫైల్స్ పంపించారు. వాటిని ఓపెన్ చేసిన వారి ఖాతాలోకి ప్రవేశించి డబ్బును తస్కరించడం మొదలుపెట్టారు. దీంతో ఆ వాట్సప్ ఖాతాలో ఉన్నవారు ఆ ఫైల్స్ ఓపెన్ చేయకూడదని పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
కొంతకాలంగా హ్యాకర్లు.. సైబర్ మోసగాళ్లు సామాన్యుల ఖాతాలను మాత్రమే హ్యాక్ చేసేవారు. వారి ఖాతాలలో ఉన్న డబ్బులను తస్కరించేవారు. అయితే ఇటీవల కాలంలో సామాన్యులను పక్కనపెట్టి పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏపీలో పుట్టా సుధాకర్ అనే టిడిపి ఎమ్మెల్యే కు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులు చేసిన సైబర్ నేరగాళ్లు.. భారీగా వసూలు చేశారు. అతడి భార్యను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టారు.. చివరికి మోసాన్ని గ్రహించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఆ ఘటన మర్చిపోకముందే సైబర్ నేరగాళ్లు ఏకంగా తెలంగాణ మంత్రుల వాట్సప్ ఖాతాలను టార్గెట్ చేయడం విశేషం.
వాస్తవానికి వాట్సప్ అనేది అత్యంత కట్టుదిట్టమైన అప్లికేషన్. ఇటువంటి దానిని హ్యాక్ చేయడం నిజంగా అసంభవం. అయితే ఇటీవల కాలంలో హ్యాకర్లు కొత్తదారిని ఎంచుకుంటున్నారు. మోసాలకు పాల్పడేందుకు వాట్సప్ ఖాతాల మీద దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నారు.. వాట్సప్ గ్రూపులలో హ్యాకర్లు ప్రవేశించి అందులో హార్మ్ ఫైల్స్ పంపిస్తారు. హ్యాకర్లు ప్రవేశించారని తెలియడానికి అదే సింబల్. అలాంటప్పుడు వెంటనే www. WhatsApp. Com/ contact లో , 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. యాప్ అన్ ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి. ఫోన్ ఓవర్ హీట్.. బ్యాటరీ వెంటనే డిశ్చార్జ్ అవుతోంది అంటే కచ్చితంగా ఫోన్ హ్యాక్ అయినట్టే. మరో మాటకు తావు లేకుండా వెంటనే ఫోన్ రీసెట్ చేసుకోవాలి. అప్పుడే హ్యాకర్ల నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం.. అశ్రద్ధగా ఉంటే మాత్రం హ్యాకర్లు మన ఖాతాలోకి ప్రవేశించి ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు.