Electronic Waste Products: ప్రపంచం నూతనత్వం దిశగా అడుగులు వేస్తోంది. కొత్తదనం కోసం పరుగులు పెడుతోంది.. కొత్త ఒక చింత.. పాత ఒక రోత అనే సామెతను నిజం చేసి చూపిస్తోంది. జనాభా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. అవసరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా ఆవిష్కరణలు ఉంటున్నాయి. అయితే కొత్త ఆవిష్కరణల వల్ల పాత ఉత్పత్తులు స్క్రాప్ గా మారిపోతున్నాయి. అయితే ఈ స్క్రాప్ అంతకంతకు పెరిగి కాలుష్యాన్ని తారస్థాయికి చేరుస్తోంది.
Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది
ఎలక్ట్రానిక్ వేస్ట్ తో..
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ ను ఏం చేయాలో ప్రపంచ దేశాలకు అర్థం కావడం లేదు. దీనివల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ ను తగలబెడితే విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అలాగని ఎలక్ట్రానిక్ వేస్ట్ ను వృధాగా ఉంచితే ప్రయోజనం ఉండదు. అది భూమిలో కలిసిపోయే అవకాశం కూడా లేదు. అయితే ఎలక్ట్రానిక్ వేస్ట్ తో సరికొత్త ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు గుజరాత్ మెకానికల్ విద్యార్థులు. మీరు ఎలక్ట్రానిక్ వేస్ట్ తో ఏకంగా సూపర్ బైక్ రూపొందించారు. దానిని కృత్రిమమైన సహాయంతో నడిచే విధంగా తయారు చేశారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
కృత్రిమ మేధ సహాయంతో..
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మెకానికల్ విద్యార్థులు శివం మౌర్య, గురుప్రీత్ ఆరోరా, గణేష్ పాటిల్ గరుడ అనే కృత్రిమ మేధా ఆదారిత ఎలక్ట్రిక్ బైక్ ను డెవలప్ చేశారు. దీనికోసం ఏకంగా 50% స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించారు. ఇది ద్విచక్ర వాహనం కోసం ఏడాది పాటు ఆ విద్యార్థులు శ్రమించారు. 1.8 లక్షలు ఖర్చు చేశారు. హై రేంజ్ సెన్సార్లు ఉపయోగించారు. అయితే రైడర్ లేకపోయినప్పటికీ ఈ బైక్ దూసుకుపోతుంది. ఈ విద్యార్థులు రూపొందించిన బైక్ హార్లే డేవిడ్సన్ కంపెనీ ద్విచక్ర వాహనం మాదిరిగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ బైక్ ప్రయోగ దశను విజయవంతంగా దాటింది. విద్యార్థులకు ప్రోత్సాహకాలు లభిస్తే మరింత శక్తివంతమైన ద్విచక్ర వాహనాలు రూపొందిస్తారని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆవిష్కరణలే ఇప్పుడు దేశానికి కావాలని.. స్క్రాప్ ద్వారా ఇలాంటి ఉత్పత్తులు రూపొందించడం మామూలు విషయం కాదని వారు చెబుతున్నారు. స్క్రాప్ ద్వారా ఇలాంటి ఉత్పత్తి తయారు చేశారంటే ఆ విద్యార్థుల మేధస్సు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.