Greeshma Reddy: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మన తెలుగువాడే. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. పిచాయ్ మెటీరియల్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకెన్సీ సంస్థలో కొద్దికాలం పనిచేసిన పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరారు, గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్, గూగుల్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సూట్ కోసం ఉత్పత్తి నిర్వహణ మరియు ఆవిష్కరణ ప్రయత్నాలకు నాయకత్వం వహించాడు. 2015, ఆగస్టు 10న పిచాయ్ గూగుల్ సీఈవోగా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే.. మనం గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు చాలా మంది వాయిస్ రికార్డర్ ఉపయోగిస్తారు. టైప్ చేయడంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండే సరైన వివరాలు రావనే ఉద్దేశంతో మౌత్ వాడుతుంటాం. ఈ మౌత్ వాడినప్పుడు మనకు వాయిస్ వివరాలు కూడా వాయిస్ రూపంలో వస్తాయి. అందమైన గొంతు మనకు సమాధానం చెబుతుంది. గూగుల్ సీఈవో తెలుగువాడే.. గూగుల్ వినిపించే వాయిస్ కూడా తెలుగు అమ్మాయిదే. ఈ విషయం చాలా మందికి తెలియదు. గూగుల్ వాయిస్ కర్నూల్‌కు చెందిన గ్రీష్మరెడ్డిది.
బీటెక్ చదివి సివిల్స్ కోసం ఢిల్లీకి..
మనలో గూగుల్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరనే సంగతి తెలిసిందే.మనకు ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే సంగతి తెలిసిందే. అయితే చెవులకు ఎంతో శ్రావ్యంగా వినిపించే గొంతు గ్రీష్మారెడ్డిదే. బీటెక్ చదివిన గ్రీష్మారెడ్డి ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. గ్రీష్మారెడ్డి స్వస్థలం కర్నూలు కాగా, తల్లి శశీదేవి డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు.డిప్యూటీ కలెక్టర్‌గా ఆమె రిటైర్ కాగా, తండ్రి జేసీ.నాథ్ కలెక్టర్‌గా రిటైర్ అయ్యారు. చెన్నైలోని ఒక కాలేజ్ లో గ్రీష్మారెడ్డి బయో టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత గ్రీష్మ కొన్ని కారణాల వల్ల ఎంబీఏ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎంఏ సైకాలజీ చేశారు.
స్నేహితురాలి ద్వారా వాయిస్ ఓవర్..
గ్రీష్మకు ఒక స్నేహితురాలు వాయిస్ ఓవర్ రంగం గురించి తెలియజేసింది. దీంతో గ్రీష్మ ఆరంగంపై దృష్టిపెట్టారు. చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమని మాట్లాడటం అంటే ఇంకా ఇష్టమని డబ్బింగ్ ఎలా చెబుతారో అనే ఆసక్తి ఉండేదని గ్రీష్మారెడ్డి పేర్కొన్నారు. అందుకే వాయిస్ ఓవర్ దిశగా అడుగులు వేశానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు గూగుల్ నుంచి కబురొచ్చిందని గూగుల్ ట్రాన్స్ లేటర్‌తో గొంతు కలిపే ఛాన్స్ దక్కిందని గ్రీష్మారెడ్డి అన్నారు. ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతోపాటు వందల కథనాలు చదివేది.ç ³దానికి అనుగుణంగా ఉచ్ఛారణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకు ప్లస్ అయింది.
తెలుగుతోపాటు ఇతర భాషల్లో ప్రభుత్వ ప్రకటనల కోసం ఆమె పని చేస్తున్నారు. గ్రీష్మారెడ్డి టాలెంట్‌తో అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Google voice over artist greeshma reddy is an inspiring success story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com