Google is listening to you: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి అవసరానికి ఫోన్ వాడుతూ ఉన్నారు. అయితే మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వలలో పడితే డబ్బుతో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఫోన్లోని కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో గూగుల్ వాయిస్ ఆఫ్ చేసుకోవడం. అంటే గూగుల్ మీ మాటలను వినకుండా చేసుకోవడం. మరి దీనిని ఎలా చేసుకోవాలి? గూగుల్ మన మాటలు వింటే ఏం జరుగుతుంది?
ఒక్కోసారి మనం క్రోమ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అంతకుముందు మనం మాట్లాడుకున్న విషయాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫర్నిచర్ కొనుగోలు చేయాలని మీరు ఎవరితోనైనా మాట్లాడితే.. దానికి సంబంధించిన యాడ్ జనరేట్ అయి మీరు గూగుల్ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకు కారణం ఏంటంటే మనసుల వాయిస్ గూగుల్ వినడమే. అయితే మొబైల్ లోని కొన్ని సెట్టింగ్స్ వల్ల ఇలా మనుషుల వాయిస్ను గూగుల్ వింటూ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచికే అయినా.. చాలా విషయాల్లో మాత్రం నష్టాన్ని చేకూర్స్తుంది. ఎందుకంటే ఒక్కోసారి పర్సనల్ గా మాట్లాడకుండా విషయాలు కూడా గూగుల్ విని స్టోర్ చేసుకుంటుంది. ఇలా వాయిస్ స్టోర్ తో కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లు, ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఇలా గూగుల్ వినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి సెట్టింగ్ మార్చుకోవాలి?
Also Read: శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది
ముందుగా మొబైల్ లోని Settings లోకి వెళ్ళాలి. ఆ తర్వాత Google అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు Web And Activity అనే ఆప్షన్ ఆన్ ఉందంటే గూగుల్ మీ వాయిస్ వింటున్నట్లే. అందువల్ల దీనిని ఆఫ్ చేసుకోవాలి. అంతేకాకుండా కిందికి Scroll చేసిన తర్వాత Including Audio అనే ఆప్షన్ పై టిక్ చేసి ఉంటే.. దానిని తీసేయాలి. ఇలా మొత్తం Web And Activity ఆప్షన్ ను ఆఫ్ చేయడం వల్ల గూగుల్ ఇక మీ వాయిస్ వినకుండా ఉంటుంది.
చాలామంది ఈ విషయాలు తెలియక పర్సనల్ సమాచారం అంతా లీక్ అవుతుంది. దీంతో ఎంతో విలువైన సమాచారం సైబర్ నేరగాళ్ల వద్దకు వెళుతుంది. అందువల్ల ముందు జాగ్రత్తతో ఇలాంటి సెట్టింగ్స్ ను మార్చుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు.