మహాభారతం ఎప్పుడు జరిగింది? అన్న దానిపై ఒక వ్యక్త చెప్పారు. ఆయన పుస్తకం చదివాక అసలు విషయం అర్థమైంది. రామాయణ, మహాభారతాలు అత్యంత పాపులర్.. అది జరిగింది? జరగలేదు అనే దానిపై ఎన్నో అనుమానాలున్నాయి..
జరిగి ఉంటే ఎప్పుడు జరిగింది? కాల పట్టిక ఎప్పుడు జరిగింది అన్నది ముఖ్యం. మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలు, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? అన్న దానిమీద క్యూరియాసిటీ నెలకొంది.
మహాభారతం ఎప్పుడు జరిగింది? అనే పుస్తకాన్ని నీలేష్ నీల్ కంఠ్ అనే వ్యక్తి రాశాడు. ఆయన అమెరికాలోని అట్లాంటాలో ఉంటాడట.. ముంబై నుంచి కెనడా.. కెనడా నుంచి అమెరికా వచ్చాడు. ఆయన ఆసక్తితో దీన్ని రాసుకొచ్చాడు. మహాభారతంపై పరిశోధన చేసి బాగా స్టడీ చేసి సంవత్సరాలు తరబడి రీసెర్చ్ చేసి ఒక కంక్లూజన్ కు వచ్చాడు.
మహాభారత గ్రంథం ఆధారంగా ఈ పుస్తకం రాసుకొచ్చాడు. ఆ రోజు కాలాన్ని కొలవడానికి నక్షత్ర గమనాలను ఆధారంగా చేసుకొని రాశారు. ఈ మాసం, గ్రహాల కదలికలు అన్నింటిని మెన్షన్ చేశారు. ఇదీ ఆయన రీసెర్చ్ కు ఆధారంగా దొరికాయి..
శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
