Google has started again: ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని విభాగాలను దున్ని పారేస్తోంది. విద్యారంగం నుంచి మొదలు పెడితే వైద్యరంగం వరకు ఇది విస్తరించింది. డిఫెన్స్ లోనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. వైద్యరంగంలో క్లిష్టమైన ఆపరేషన్లను చేపట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నారు.. భవిష్యత్తు కాలంలో అంతరిక్ష ప్రయోగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. కేవలం సాంకేతిక రంగాలలో మాత్రమే కాకుండా.. మనిషికి ఉపకరించే అన్ని విభాగాల్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వినియోగించుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల కాలంలో సముద్ర జాతుల అధ్యయనం.. కాలుష్యాన్ని నిరోధించడానికి.. వంటి వాటిల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను శాస్త్రవేత్తలు ఉపయోగించబోతున్నారని కథనాలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే కేవలం ఐటీ రంగాలనే కాకుండా ఇతర విభాగాలను కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ షేక్ చేయబోతుందని తెలుస్తోంది.
గూగుల్ మొదలుపెట్టింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఉపకరణాలను తయారు చేసింది గూగుల్. గతంలో స్మార్ట్ గాగుల్స్ పేరుతో ఉపకరణాలను తీసుకొచ్చినప్పటికీ.. అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ స్మార్ట్ గ్లాసులను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాగుల్స్ ద్వారా వర్చువల్ రియాల్టీని ఆస్వాదించవచ్చు. ఆర్గమెంటేడ్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. ఈ గాగుల్స్ ధరించి ఏదైనా టెక్స్ట్ ట్రాన్స్లేట్ చేయవచ్చు. ఇందులో స్పీకర్లు ఉంటాయి. మైక్రోఫోన్లు ఉంటాయి. అంతేకాకుండా మనం ఏదైనా దృశ్యం చూసినప్పుడు వెంటనే కళ్ళజోడు ద్వారా వాటిని పిక్చరైజ్ చేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వీటిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. గతంలో గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఈసారి మాత్రం గూగుల్ గట్టి ప్రయత్నాలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ఇవి మార్కెట్లో ప్రవేశిస్తాయని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే గూగుల్ ఈ స్మార్ట్ గ్లాసెస్ మీద డెమో కూడా ఇచ్చింది. ముందుగా ఈ గ్లాసెస్ ను అమెరికా మార్కెట్లో రిలీజ్ చేసి… ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. గూగుల్ ఈసారి అత్యధిక సాంకేతికతలను ఈ స్మార్ట్ గ్లాసెస్ కు జోడించిన నేపథ్యంలో అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వీటి ధర ఇంతవరకు నిర్ణయించకపోయినప్పటికీ.. ప్రస్తుత అంచనాల ప్రకారం 50వేల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.