Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSundar Pichai: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను భయపెడుతున్న గూగుల్ సీఈవో సంచలన ప్రకటన.. ఆయన ఎమన్నారంటే..!

Sundar Pichai: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను భయపెడుతున్న గూగుల్ సీఈవో సంచలన ప్రకటన.. ఆయన ఎమన్నారంటే..!

Sundar Pichai: ప్రపంచంలో సాంకేతికత రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీపై ఇటు తయారీదారులు.. అటు వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. ఇప్పడు టెక్నాలసీలో సంచలనం సృష్టిస్తోంది ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ). రెండేళ్లుగా దీని వినియోగం పెరుగుతోంది. ఏఐతో మానవ వనరుల వినియోగం తగ్గుతోంది. విద్యవైద్యంతోపాటు అన్ని రంగాల్లోనూ ఏఐ వినియోగం పెరిగింది. చివరకు పాఠాలు కూడా ఏఐ సాయంతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఏఐపై అప్‌డేట్‌ కావాల్సిన పరిస్థితి నెలకొంది. సాఫ్ట్‌వేర్‌ సంక్షోభానికి ఏఐ రావడం, దానిపై ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నవారు అప్‌డేట్‌ కాకపోవడం కూడా ఓ కారణం అని చాలా మంది నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరుణంంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చేసిన ప్రనకటన మరింత కలవర పెడుతోంది. 2024 మూడో ట్రైమాసిక అర్నింగ్‌ కాల్‌ సందర్భంగా ఆయన గూగుల్‌ కొత్త కోడ్‌లో 25 శాతం కృత్రిమ మేధ(ఏఐ)తోనే రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కలవరం ఎందుకంటే..
ఏఐతో కొత్త కోడ్‌లు తయారు చేయిస్తే.. కంపెనీలె పనిచేసే ఇంజినీర్లు, కోడ్‌ల రూపకర్తలకు పని లేకుండా పోతుంది. ఇది కోడ్‌ ల్యాండ్‌ స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తుంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనితో కోడర్లు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంజినీర్లు, ఉన్నత స్థాయి సమస్య పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.

నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..
ఆటోమేషన్‌ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఎంట్రీ లెవల్, రొటీన్‌ కోడింగ్‌ ఉద్యోగాల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకునేందుకు ఇంజినీరు కూడా తమ నైపుణ్యం పెంచుకోవాల్సిన పరిస్థితి. అన్నింకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగానికి గూగుల్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అని చెప్పడానికి పిచాయ్‌ ప్రకటన ఉదాహరణ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular