Pawan Kalyan : జలజీవన్ మిషన్.. ఇంటింటికి తాగునీటి పథకం, 2019 లో ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగిస్తూ ఈ పథకాన్ని ప్రకటించాడు. ఆ రోజుకు మొత్తం దేశంలో ఇంటింటికి తాగునీటి కులాయి లేదు. కేవలం 16.7 శాతం గృహాలకు మాత్రమే భారత్ లో నీటి కుళాయి ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రతి ఇంటికి తాగునీటిని ఇవ్వలేకపోయాం.
ఉజ్వల పథకంలో వంటింటి గ్యాస్ కష్టాలు తీరాయి. జలజీవన్ మిషన్ కింద 2024 కల్లా పూర్తి చేస్తానని మోడీ ప్రకటించారు. కానీ ఈ విస్తృత భారత దేశంలో అది 100 శాతం పూర్తికాలేదు. ప్రస్తుతానికి 80.47 శాతానికి పెరిగింది. దీనికి రాష్ట్రాల సహకారం కావాలి. కేంద్రం అనుకుంటే సరిపోదు. రాష్ట్రాలు సగం వాటాను అందించాలి. కేంద్రపాలిత ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ తాగునీటి కుళాయిలు సాధ్యం కాలేదు.
కేరళ అత్యంత ఫార్వర్డ్ రాష్ట్రం. కానీ జల్ జీవన్ మిషన్ లో కేరళ లాస్ట్ లో ఉంది. ఏపీలో 2019 నాటికి 16.71 శాతం ఉంది. ఇప్పుడు 73.82 శాతం గా ఉంది.
జల్ జీవన్ మిషన్ అమలులో పవన్ కళ్యాణ్ విజయవంత మవుతాడా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

