Good News For Watsapp Users: దిగ్గజ మేసేజింగ్ యాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రకాల కొత్త సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చింది. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు, సరి కొత్త అనుభూతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రియాక్షన్స్, 2 జిబి ఫైల్ షేరింగ్, 512 గ్రూప్స్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా స్కిన్ టోన్ సెలెక్టర్ తో సహా పూర్తి ఎమోజి కీబోర్డుతో వాట్సాప్ లో రియాక్షన్స్ అనేవి మరింత మెరుగు కానున్నాయి. అదేవిధంగా వినియోగదారులు తన కుటుంబం, స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు భావాలను వ్యక్తీకరించేందుకు, మరిన్ని మార్గాలు పరిచయం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని కంపెనీ వర్గాలు అంటున్నాయి.

..
వాట్సాప్ కమ్యూనిటీ ల కోసం గత నెలలో మార్పులు చేర్పులు చేస్తామని కంపెనీ ప్రకటించింది. దానికి తోడుగానే సంస్థలు, వ్యాపారాలు, ఇతర సన్నిహిత సమూహాల కోసం కమ్యూనికేట్ చేయడానికి యాప్ లో పలు మార్పులు చేర్పులు చేపట్టింది. ఏమోజి రియాక్షన్లు కూడా ఇప్పుడు వాట్సప్ లేటెస్ట్ మొబైల్ రూపంలో కంపెనీ అందుబాటులో ఉంచింది. రియాక్షన్లు అనేవి ఫన్, ఫాస్ట్, రీలోడ్ టైం కూడా చాలా తగ్గుతుంది. ఇదే కాకుండా వాట్స్అప్ యూజర్లు ఇకనుంచి 2 జిబి వరకు ఫైల్ ను షేర్ చేయవచ్చు. ఒకేసారి పెద్ద సంఖ్యలోని వీడియోలను సెండ్ చేయవచ్చు. ఇదివరకు ఈ పరిమితి 100 ఎంబి గా ఉండేది. వైఫై సహాయంతో లార్జ్ ఫైల్ ను సెండ్ చేయడం ఉత్తమం అని కంపెనీ అంటోంది. గతంలో వీడియో షేరింగ్ లిమిట్ వల్ల యూజర్ లో చాలా ఇబ్బంది పడేవారు. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. టు జిబి వరకు వీడియోలను సులభంగానే సెండ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇరువైపులా కస్టమర్లు ఫైల్ అప్లోడింగ్, డౌన్లోడింగ్ కు అధిక డేటా ఖర్చు అవుతుంది. అలాగే యూజర్ల కోరిక మేరకు 512 సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చని కంపెనీ తెరిపింది. కంపెనీ కల్పించిన కొత్త సౌకర్యాల వల్ల చాలామందికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే చాలామంది యూజర్లు తమకు రిక్వెస్ట్ పెట్టడం వల్లే ఈ సౌకర్యాలు తీసుకొచ్చామని వాట్సప్ కంపెనీ తెలుపుతోంది. అయితే మెటా కంపెనీ ఎప్పుడైతే వాట్సాప్ ను టేక్ ఓవర్ చేసిందో అప్పుడే యాప్ లో మార్పులు చేర్పులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడు లేని సౌకర్యాలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వాట్సాప్ లో ఉన్న సౌకర్యాల వల్ల చాలా పనులు జరుగుతున్నాయి. లొకేషన్ దగ్గర నుంచి చెల్లింపుల వరకు వాట్సాప్ లో ప్రస్తుతం ఒకటి రెండు మినహా జరగని పని అంటూ లేదు. మునుముందు సౌకర్యాలను మరింత పెంచి మరింత మంది యూజర్లను ఆకట్టుకునేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని వాట్సప్ అంటున్నది. మరోవైపు అమెరికా, యూరప్ మార్కెట్లలో ఊగిసలాట ఉన్నప్పటికీ మెటా కంపెనీ షేర్లు రాకెట్ లాగా దూసుకుపోతుండడం గమనార్హం.