
James Cameron- Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్ర ప్రభంజనం ఇంకా ఆగలేదు..బాక్స్ ఆఫీస్ పరంగా ప్రభంజనాలకు కేంద్ర బిందువుగా నిలిచినా ఈ చిత్రం, ఓటీటీ లో విడుదలైన తర్వాత అంతకు మించి పదింతలు ప్రభంజనం సృష్టించింది..ఇతర దేశాల్లో ఉన్న ఆడియన్స్ ఈ సినిమాని అమితంగా ఇష్టపడ్డారు.అందుకే ఈ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు అలాగే ‘ఆస్కార్’ అవార్డ్స్ లో నామినేషన్స్ దక్కాయి.
ఇక ఈ సినిమాని చూసి టైటానిక్ మరియు అవతార్ సిరీస్ వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలను తెరకెక్కించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే, ఆయన రాజమౌళి ని పొంగుతున్న వీడియో సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసింది మూవీ టీం, ఇప్పుడు ‘టైటానిక్’ చిత్రం రీ రిలీజ్ అవుతున్న నేపథ్యం లో జేమ్స్ కెమరూన్ పలు హాలీవుడ్ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో రామ్ చరణ్ పాత్ర నాకు ఎంత గానో నచ్చింది..ఆ పాత్ర లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి..వాస్తవానికి అలాంటి పాత్రలు పోషించడం చాలా కష్టం, రాజమౌళి ఆ పాత్ర ని తీర్చి దిద్దిన తీరు అద్భుతం..నాకు ఎంతగానో నచ్చింది..రీసెంట్ గానే రాజమౌళి ని కలిసినప్పుడు కూడా నేను ఇదే చెప్పను’ అంటూ జేమ్స్ కెమరూన్ ప్రశంసలతో ముంచి ఎత్తాడు.
ఈ వీడియో ని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు..తమ హీరోకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ మురిసిపోతున్నారు..మెగాస్టార్ చిరంజీవి తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో సాధించలేని ఎన్నో ఘనతలను రామ్ చరణ్ సాగిస్తున్నాడని, తండ్రిని మించిన తనయుడు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఫ్యాన్స్.
Meeku troll pages unte maku @JimCameron unnadra lafoot ani cheptunnam @Thyview @LetsOTTOff @NTRFanTrends @ssk1122 https://t.co/xQtdy8PRN1
— V A A L M I K I 🔱 (@Valmiki_Tweets) February 11, 2023