Funny AI Comedy: ఒకప్పుడు బూతు అనేది నెట్టింట్లో మాత్రమే ఉండేది. మారిన టెక్నాలజీ వల్ల ఇప్పుడు అది నట్టింట్లోకి కూడా వచ్చింది.. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే బూతులు చూస్తూ.. బూతులు వింటూ.. బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బుల కోసం.. ఫేమస్ అవడం కోసం.. పేరు తెచ్చుకోవడం కోసం చాలామంది బూతులను వాడుతున్నారు. ఇటీవల ఒక హద్దు కూడా దాటిపోయి ఏకంగా బూతులను మాట్లాడేస్తున్నారు.. మాట్లాడించేలా చేస్తున్నారు.
Also Read: Telangana Liquor Sales: తెలంగాణ మందుబాబులకు షాక్.. ఇక తాగడం కష్టమే
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కింది. కృత్రిమ మేధ సరికొత్త పరిజ్ఞానాన్ని కళ్ళ ముందు ఉంచుతోంది.. కృత్రిమ మేధ వల్ల అనేక రకాల సౌకర్యాలు కళ్ళ ముందుకు వచ్చాయి. అప్పటికప్పుడు ఒక బొమ్మ కావాలంటే కృత్రిమ మేధ గీసి ఇస్తోంది. నచ్చిన వీడియో కావాలి అంటే రూపొందించి ఇస్తోంది. ఇష్టమైన విషయం మీద వ్యాసం రాయాలంటే వెంటనే ఆ పని చేస్తోంది.. తెలియని విషయం గురించి టైప్ చేస్తే కోకొల్లలుగా సమాచారం ఇస్తోంది. అంతేకాదు డీకోడింగ్ నుంచి మొదలు పెడితే ప్రోగ్రామింగ్ వరకు.. వ్యాసం నుంచి వ్యాకరణం వరకు కృత్రిమ మేధ చేయని పని అంటూ లేదు. అందువల్లే ప్రపంచం మొత్తం ఇప్పుడు కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది.
కృత్రిమ మేధ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. కృత్రిమ మేధ వల్ల ఎలాంటి నష్టాలు చేకూరుతున్నాయో వీడియో నిరూపిస్తోంది. ఆ వీడియోలో కొందరు అమ్మాయిలు మాట్లాడుతున్నారు. స్టాండప్ కామెడీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వారు మాట్లాడుతున్న బూతులు అత్యంత దరిద్రంగా ఉన్నాయి. ఆ వీడియోలను చూస్తుంటే నిజంగా అమ్మాయిలు అలానే మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది.. సంసార జీవితం గురించి నిర్లజ్జగా వారు మాట్లాడుతూ ఉన్న మాటలు వివగింపు కలిగిస్తున్నాయి. ప్రేమ.. ఇతర వ్యవహారాల గురించి వారు మాట్లాడుతున్న శైలి అత్యంత దారుణంగా ఉంది..
Also Read: Tesla Cybertruck Features: రూ.కోటి 30 లక్షల సైబర్ ట్రక్.. ఇందులో అంత స్పెషల్ ఏముంది?
ఈ వీడియో లో ఉన్న అమ్మాయిలు నిజంగానే అలా మాట్లాడారేమో అనిపిస్తుంది. ఆ వీడియోలను లోతుగా చూస్తే తప్ప కృత్రిమ మేధ ద్వారా రూపొందించారని గుర్తుపట్టడం కష్టం. సంసార జీవితంపై, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన ఆ వీడియోలు అత్యంత దారుణంగా ఉన్నాయి. అమ్మాయిలనే కాకుండా, ఓ వృద్ధురాలిని రూపొందించి ఆమెతో కూడా అలాంటి బూతులు మాట్లాడించడం అత్యంత హీనంగా ఉంది. కృత్రిమ మేధ లో ఇప్పుడు చూస్తున్నది మొత్తం ప్రాథమికమేనని.. ఇంకా చాలా సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇలాంటి దారుణమైన వీడియోలు భవిష్యత్తు కాలంలో వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఆ స్థాయిలో పెరిగిన తర్వాత.. దాని ఉపయోగించి ఇంతకంటే హీనమైన వీడియోలు రూపొందించరనే గ్యారెంటీ లేదు కదా. టెక్నాలజీ మనిషి జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చాలి. కష్టమైన పనులను సులువుగా మార్చాలి. కానీ మారిన పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఇంతలా బజారున పడెయ్యకూడదు.
AIతో ఆడపిల్ల బూతు వీడియోలు..
స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోక్ లు
నిజమైన అమ్మాయిలు అనుకునేలా ఉన్న AI వీడియోలు
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను దుర్వినియోగం చేస్తున్న కొంతమంది టెకీలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు pic.twitter.com/LK3IHwpirO
— ChotaNews App (@ChotaNewsApp) July 16, 2025