Electric Scooters India : ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, పెద్ద పెద్ద టూ-వీలర్ కంపెనీలు కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉంది. కస్టమర్లకు ఈ స్కూటర్లు దాదాపు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. మరి త్వరలో రాబోతున్న ఆ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. సుజుకి ఈ-యాక్సెస్
సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో ఈ-యాక్సెస్ తో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ సుజుకి ఈ-యాక్సెస్ ఇదే నెలలో అంటే జూన్ 2025లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఇందులో 3.07 kWh కెపాసిటీ ఉన్న లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని 4.1 kWh ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.1.2 – రూ.1.4 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.
2. హీరో విడా VX2
హీరో కంపెనీ జూలై 1న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ స్కూటర్ పేరు విడా VX2. ఇది ప్రస్తుతం ఉన్న వి2 రేంజ్ కంటే తక్కువ ధరలో ఉండొచ్చు. అయితే, VX2 గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. స్పై ఇమేజ్‌ల ప్రకారం దీని డిజైన్ వి2 తో పోలి ఉంటుందని సమాచారం. ఈ విడా VX2 లో కూడా వి2 లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది.
3. టీవీఎస్ ఆర్బిటర్
టీవీఎస్ కంపెనీ అక్టోబర్ 2025 నాటికి దేశీయ మార్కెట్‌లో తమ ఐక్యూబ్ మోడల్ కంటే తక్కువ ధరలో ఒక కొత్త, చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతోంది. దీని పేరు ఆర్బిటర్ కావచ్చని అంచనా. దీని ధర రూ. లక్ష లోపే ఉండొచ్చు. టీవీఎస్ ఆర్బిటర్ లో ఐక్యూబ్ బేస్ ట్రిమ్లో ఉండే 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. అలాగే, బాష్ నుంచి తీసుకున్న హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చు. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం.