Einstein prediction: ప్రపంచ వ్యాప్తంగా సమయాలు భిన్నంగా ఉంటాయి. ఇందుకు కారణం భూభ్రమణం. భూమి సూర్యునిచుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. అందుకే చాలా వరకు భూమిపై 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉంటుంది. దీని ఆధారంగా సమయం కూడా మారుతుంది. మన దేశంలో రాత్రి అయితే అమెరికాలో ఉదయం అవుతుంది. ఇలాగే ఇప్పుడు మార్స్ గ్రహంపై జరుగుతున్న అధ్యయనంలో మన సమయానికి భిన్నంగా కాలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ గ్రహంపై సమయం భూమితో పోలిస్తే భిన్నంగా ప్రవహిస్తుందని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంచనా వేశారు. తాజా అధ్యయనాలు దానిని ధ్రువీకరించాయి. భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలు ఈ వైరుధ్యాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
39 నిమిషాల 35 సెకన్లు ఎక్కువ…
మార్స్ రోజు ’సోల్’ అని పిలుస్తారు, ఇది భూమి రోజుకు 24 గంటల 39 నిమిషాల 35 సెకన్లు ఎక్కువ ఉంటుంది. నాసా ఇంజనీర్లు మిషన్ కంట్రోల్లో రెండు గడియారాలను ఉపయోగిస్తారు – ఒకటి భూమి సమయం, మరొకటి మార్స్ సోల్. ఈ తేడా కారణంగా వారి షెడ్యూల్ ప్రతి రోజూ మారుతూ, ఒక వారంలో 5 గంటలు, ఒక నెలలో పూర్తి రాత్రి–పగలు భ్రమణం చెందుతుంది.
గ్రహాంతరం కష్టం
పెర్సెవరెన్స్ రోవర్ వంటి వాహనాలు స్థానిక మార్స్ సౌరసమయానికి సమన్వయిస్తూ, రోజూ మధ్యాహ్నం పని చేసి, రాత్రి చలిని ఎదుర్కొంటాయి. ఇంజనీర్లు మార్స్ సమయంలో జీవించి, ఉదయం 6 గంటలకు పడుకుని, మధ్యాహ్నం లేచి చీకటి భోజనం చేస్తారు. ఈ అనుభవం ’గ్రహ జీత్లాగ్’గా పిలువబడుతోంది.
గురుత్వాకర్షణ కారణంగా తేడా..
ఆయిన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం, గురుత్వాకర్షణ, వేగం సమయాన్ని ప్రభావితం చేస్తాయి. మార్స్‌లో భూమి కంటే తక్కువ గురుత్వం, భిన్న కక్ష్య వేగం వల్ల సమయం స్వల్పంగా వేగంగా గడుస్తుంది. ఆర్బిటర్లు, ల్యాండర్ల మధ్య డేటా సమన్వయంలో ఈ తేడా కనిపించింది. భూమి ఎ్క ల్లాగానే మార్స్‌లో కూడా సర్దుకోవాలి.
ఈ తేడాను విస్మరిస్తే, నావిగేషన్ మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు తప్పుతుంది. సురక్షిత భూములు లేదా ప్రమాదకర క్రేటర్ల మధ్య తేడాగా మారుతుంది. దీర్ఘకాల రోవర్ ప్రయాణాల్లో ఈ సర్దుకోలు కీలకం. మార్స్ మిషన్లు ఇకపై ఈ గ్రహాంతర సమయ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుంటాయి.