Earth age in years : మనం జీవిస్తున్న.. ఇతర జీవరాశి మనగల సాగిస్తున్న భూమి వయసు ఎంత ఉంటుంది? అసలు భూమి ఎప్పుడు పుట్టి ఉంటుంది? భూమి వయసు సరిగ్గా ఇంత ఉంటుందని ఎవరైనా చెప్పారా? పోనీ మత గ్రంథాలు చెప్పిందే నిజమా? ఇందులో ఏది సరైనది.. ఇప్పటివరకు దీనిపై ఒక స్పష్టత రాలేదు.. అయితే తొలిసారిగా భూమి వయసుకు సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం.. భూమి వయసు అనేది సంవత్సరాలతో ముడిపడి ఉన్నది కాదట. భూమి వయసును ఒక చక్రియ చక్రం లోని కాలం ఆధారంగా భావించాలాట. జియో లాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వెలువరించిన నివేదిక ప్రకారం.. భూమి వయసును కల్పంతో నిర్ధారిస్తారట. కల్పంలో ప్రతి చక్రాలు ఉంటాయి. ఒక్కో ప్రతి చక్రం 4.32 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. కల్పం అనేది చాలా సుదీర్ఘమైన కాలం. ఇది 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో విశ్వం అనేది మనగడులో ఉందని.. అనేక విధాలుగా పరిణామ క్రమం చెందిందని చెబుతుంటారు. ఒకరోజు కల్పం 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం. ఇక ఈ కాలంలో రాత్రి కూడా అదే స్థాయిలో వ్యవధి కలిగి ఉంటుంది.
ఇక హిందూ ధర్మం ప్రకారం భూమి వయసు చక్రియస్వభావం ఆధారంగా పరిగణిస్తారు.. భూమి అనేది అనేక మార్పులకు గురవుతుంది. ఇక ఒక కల్పంలో కృతయుగం 1,728,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1,296,000, ద్వాపరయుగం 864,000, కలియుగం 432,000 సంవత్సరాలు.. మొత్తంగా ఇది 4.32 విలియన్ సంవత్సరాలు. ఇక ఇందులో ఒక దివ్య సంవత్సరం అంటే 360 మానవ సంవత్సరాలు. దీనిని ఒక మహాయుగం అని కూడా పిలుస్తుంటారు.
Also Read : భూమిపై జీవం ఎప్పుడు, ఎలా అంతమవుతుంది?
ఇక సనాతన సంస్కృతి ప్రకారం ప్రస్తుత విశ్వ కాలచక్రంలో ఇప్పటికే 27 మహాయుగాలు గడిచిపోయాయట. ఒకరకంగా ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో కొనసాగుతున్నాం. స్థూలంగా చెప్పాలంటే మహాయుగం నాటి కలియుగంలో మనం ఉన్నాం. ఇక ప్రస్తుత 2025 నాటికి దాదాపు 5127 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కలియుగంలో ఇంకా 426,873 ఏళ్లు మిగిలి ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే భూమి వయసు దాదాపు 116 బిలియన్ సంవత్సరాల పైన ఉంటుందని తెలుస్తోంది..
ఇక బైబిల్ సాహిత్యాన్ని పరిశీలనకు తీసుకుంటే.. భూమి వయసు అనేది సాధారణంగా ఆరు నుంచి పదివేల సంవత్సరాల వయసు ఉందని నమ్ముతుంటారు. బైబిల్లో ఆదికాండము లోని సృష్టి కథనం, వంశావళి రికార్డుల ఆధారంగా భూమి వయసును లెక్కించారు.
ఖురాన్ ప్రకారం భూమి వయసును స్పష్టంగా వెల్లడించలేదు. ఖురాన్ లో కాల పరిమితిని రోజులుగా పేర్కొంటారు. రూపకంగా కూడా భావిస్తుంటారు. అయితే వారి నమ్మకం ప్రకారం విశ్వం అనేది ఆరు రోజుల్లో.. భూమి అనేది రెండు రోజుల్లో ఏర్పాటయిందని నమ్ముతుంటారు.
సైన్స్ ప్రకారం భూమి వయసు 4.54 బిలియన్ సంవత్సరాలు పై మాటగా ఉంటుందట. ఎందుకంటే భూమిలో కలిసిపోయిన డైనోసార్స్ అవశేషాలను శాస్త్రవేత్తలు బయటికి తీశారు. ఆ ప్రకారం భూమి వయసు బిలియన్ సంవత్సరాలు ఉంటుందని ఒక అంచనా.