DRDO: భారత ఆర్మీలో.. వాయుసేన కీలకపాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన వాయుసేన ఉగ్రస్థావరాలతోపాటు పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లను తుత్తుతుత్తు చేసింది. ఇప్పటికీ పాకిస్తాన్ ప్యాచ్ వర్క్‌లు చేసుకుంటోంది. ఇంతటి కీలకమైన వాయుసేనకు చెందిన తేజన్ యుద్ధ విమానం.. ఇటీవల దుబాయ్‌లో కూలిపోయింది. ఎయిర్‌షో సందర్భంగా ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. మన వింగ్ కమాండర్ దుర్మరణం చెందారు. దీంతో తేజస్ యుద్ధ విమానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
విదేశీ ఇంజిన్లే..
భారత్ చాలా వరకు విదేశీ యుద్ధ విమానాలే కొనుగోలు చేసింది. మొన్నటి రఫేల్ కూడా ఫ్రాన్స్‌కు చెందినది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టిపెట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆయుధాలు తయారు చేస్తోంది. డీఆర్డీవో, హెచ్‌ఏల్ ఆయుధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే తేజస్ కూడా మనం తయారు చేసుకున్నదే. అయితే ఇందులో ఉన్న ఇంజిన్ మాత్రం విదేశీయులది. మన తయారు చేస్తున్న విమానాల్లో వాడుతున్న ఇంజిన్లన్నీ వీదేశాల నుంచి తెచ్చినవే. మనం సొంత ఇంజిన్లు తయారు చేసుకోకుండా అమెరికా, రష్యా అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వారి వ్యాపారం దెబ్బతింటుంది.
డీఆర్డీవో అద్భుతం..
ఈ క్రమంలో మన డీఆర్‌డీవో అద్భుతం చేసింది. శాఫ్రాన్ పేరిట ఫిఫ్త్ జనరేషన్ స్వదేశీ ఇంజిన్ డిజైన్ పూర్తి చేసింది. ఇది విజయవంతం అయితే భారత రక్షణ పరిశ్రమలో స్వయం ఆధారత ఎక్కువ అవుతుంది, విమాన యంత్రాలు కేవలం దిగుమతులపై ఆధారపడకుండా తయారీ విస్తరణ జరుగుతుంది. తేజస్ ప్రాజెక్టుకు సరిపోయే ఇంజిన్ ఎంపిక కీలకం. జీఈ ఎఫ్404, యూరోజెట్ ఈజే200 లాంటి ఆధునిక ఇంజిన్లు తేజస్‌కు సమర్థవంతంగా ఉండటంతో డీఆర్డీవో కవేరి ఇంజిన్‌లో తక్కువ శక్తి కారణంగా అవమానాలు ఎదురైంది. అందుకే శక్తివంతమైన ఇంజిన్ వికాసం దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుతుంది.
డీఆర్డీవో శాఫ్రాన్ ఇంజిన్‌ను పూర్తి చేసి పారదర్శకతలతో ఇంజిన్ తయారీలో విదేశాలపై ఆధారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇది భారత అభివృద్ధిని ప్రపంచస్థాయిలో నిలబెట్టే కీలక దశగా భావిస్తున్నారు. ఈ విజయాలు భారత వేదికపై స్వదేశీ యుద్ధ విమాన పరిణామానికి కీలక పాత్ర పోషిస్తున్నాయి.