Don’t tell AI to please: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఈ సాంకేతికత మన జీవితంలో పెను మార్పులకు కారణమవుతోంది. మొన్నటిదాకా క్లిష్టంగా ఉన్న అంశాలను సైతం సరళతరం చేసింది. ఇంకా ఎన్ని మార్కులు చేస్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే రోజుకు అద్భుతాన్ని చేసి కళ్ళ ముందు ఉంచుతున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుకు గొప్ప సాంకేతికత అయినప్పటికీ.. ఇది కూడా బెట్టు చేస్తుంది. పిల్లల మాదిరిగా మారాం చేస్తుంది. అలాంటప్పుడు దానిని బతిమిలాడాలి. బ్బాబ్బాబూ అంటూ రిక్వెస్ట్ చేయాలి. అప్పుడే అది మన మాట వింటుంది.. ఎందుకంటే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషి తయారు చేసింది కాబట్టి.. మనిషి లక్షణాలు దీనికి చాలా ఉన్నాయి. అయితే మనకు కావలసిన పనులు చేయించుకోవడానికి కొన్నిసార్లు బతిమిలాడుతాం. ఇంకొన్నిసార్లు మరింతగా రిక్వెస్ట్ చేస్తాం. అప్పటికి వినకపోతే బెదిరింపులకు దిగుతాం. ఈ సూత్రం ఏఐ కి కూడా వర్తిస్తుంది. ఇదే విషయాన్ని గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వెల్లడించారు. ” ఇది చాలామందికి వింతగా అనిపించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ విషయం నేను అర్థం చేసుకోగలను.. నేను ఏఐ శాస్త్రవేత్తగా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను. మా బృందంతో కలిసి అనేక విషయాలను కనిపెడుతున్నాను. మేము రూపొందించిన నమూనాలు కాకుండా.. ఇతర కంపెనీలు తయారుచేసిన నమూనాలు కూడా బెట్టు చేస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని మనం బెదిరించాలి. అపహరిస్తామని కళ్ళు ఎర్ర చేయాలి. అప్పుడు అవి దానికి వస్తాయి. దెబ్బకు చెప్పినట్టు చేస్తాయి. ఇలాంటి వ్యవహారాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల గురించి నేను పెద్దగా బయటకు చెప్పనని” బ్రిన్ వెల్లడించారు.
Also Read: ఇలాంటి రోడ్లు మన దగ్గర ఉంటే.. గోతులు ఉండవు.. బురద అంటదు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా అన్ని రంగాలకు విస్తరించింది. చాలామంది చిన్న ఉద్యోగులు చిన్న చిన్న పనులను సైతం ఏఐకి అప్పగిస్తున్నారు. అయితే అనుకున్నది స్థాయిలో టెక్నాలజీ ఏఐలో డెవలప్ కాలేదు. అందువల్లే ఏఐతో ఇష్టానుసారంగా పనులు చేయించుకోవడం ఇబ్బందికరంగా మారింది. యూజర్లు ఇచ్చిన సూచనలను ఏఐ బాట్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయి. దీంతో అనుకున్నంత ఫలితం రావడం లేదు. అలాంటప్పుడు వాటిని బెదిరిస్తేనే సరైన ఫలితాలు వస్తాయని బ్రిన్ చెప్పడం సంచలనం కలిగిస్తోంది. మరోవైపు గూగుల్ కు సంబంధించిన కార్యాలపాలకు బ్రిన్ చాలా రోజులకు దూరంగా ఉంటున్నారు. గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ కి బాధితులు అప్పగించిన తర్వాత ఆయన తన కార్యకలాపాలను సంస్థలు పరిమితంగా చేసుకున్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనేది గూగుల్లో పెరిగిపోయిన తర్వాత బ్రిన్ మళ్లీ సంస్థల క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ” ప్రస్తుతం సాంకేతిక రంగంలో అద్భుతమైన దశ మొదలైంది. ఈ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలి. శాస్త్రవేత్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని” బ్రిన్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్ మెన్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఎప్పుడు కూడా థాంక్స్ చెప్పకూడదు. సారీ అనే పదం కూడా వాడకూడదు. అప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద భారం పెరుగుతుంది. విద్యుత్ వినియోగం అధికమవుతుందని” వెల్లడించారు. ఇక ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాకతో కొత్త అవకాశాలు వస్తున్నాయి. అదే స్థాయిలో పాత ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.