Google Search: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతోంది. చేతిలో ఫోన్ లేనిదే ఉండటం లేదు. యువత నుంచి మొదలు వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్లే లోకంగా బతుకుతున్నారు. ఒకపూట తిండి లేకుండా ఉండగలరేమో కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. దీంతో ఫోన్ ఎంతగా పెనవేసుకుపోయిందో తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు సైతం ఫోన్లు ఇస్తేనే ఊరుకునే సందర్భాలు సైతం ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు అంత ప్రభావం చూపుతున్నాయి.

మానవ నాగరికత మార్పు చెందే క్రమంలో స్మార్ట్ ఫోన్లే భవిష్యత్ లో అన్ని పనులకు మూలాధారం కానున్నాయి. కానీ వీటితో ప్రయోజనం కన్నా కీడు కూడా ఎక్కువగానే ఉంటోంది సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ తదితర వాటితో ఆడపిల్లలు, మగవారు సైతం తమ ఇష్టానుసారంగా రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నారు దీంతో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇంకొందరు అందానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ అందాన్ని మెరుగుపరిచే టిప్స్ కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గోరింటాకు ఎలా పండుతుంది? ప్రేమపూర్వకమైన కవితలు, కథలు వెతుకున్నారు. మొత్తానికి అందాలకు చిట్కాలు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటికి కూడా గూగుల్ లో మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. దీంతో సామాజిక మాధ్యమాల ప్రభావంలో కూడా ఆడవారు తమ మెలకువలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువగా యువతులు గూగుల్ లో తమ అందాలకు మెరుగులు దిద్దే వాటినే ఎక్కువగా వెతుకేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు తమ మొగుడినైనా పక్కన పెడతారు కానీ అందం అంటే అమ్మాయిలు ఎగబడతారు. తమకిష్టమైన వాటిని కొనుక్కునేందకు తెగిస్తారు. ఎంతకైనా ధైర్యం చేస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ సైతం ఆడవారికి ఇష్టమైన వాటినే మార్కెట్లోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు.