Truecaller: అన్ నోన్(unknown) నంబర్స్ నుంచి ఎవరు కాల్స్ చేస్తున్నారో గుర్తించే ప్రముఖ యాప్ ట్రూ కాలర్ ( Truecaller) తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్ మాదిరి ట్రూ కాలర్ వెబ్ (Truecaller web) ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మొబైల్ ను డెస్క్ టాప్ లేదా లాప్టాప్ లోనూ సెర్చ్ చేయొచ్చు. గుర్తు తెలియని నెంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ట్రూ కాలర్ వెబ్ సహాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్ ను ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ కు కనెక్ట్ చేయొచ్చు.
దీని ద్వారా ఫోన్లో వచ్చే ఎస్ఎంఎస్ ఇన్ బాక్స్ మొత్తం రీడ్ చేయొచ్చు. అవసరమనుకుంటే అక్కడి నుంచే రిప్లై కూడా ఇవ్వచ్చు. కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు.. దానిని చూడాల్సిన అవసరం లేకుండానే ఇన్ కమింగ్ కాల్, మెసేజ్ అలర్ట్ డెస్క్ టాప్ లోనే పొందొచ్చు. ట్రూ కాలర్ వెబ్ కు కనెక్ట్ చేయగానే.. ఇప్పటివరకు మొబైల్లో ఉన్న సందేశాలను మొత్తం అది కేవలం సెకండ్ల వ్యవధిలోనే చూపిస్తుంది. ఈ సదుపాయంతో యూజర్లు తమ ఫోన్ చూడకుండానే (కాల్ మాట్లాడటం మినహా) మిగతావన్నీ చేయవచ్చని ట్రూ కాలర్ నిర్వాహకులు చెబుతున్నారు. గుర్తు తెలియని నెంబర్లను తెలుసుకోవడం ద్వారా.. వాళ్లు ఎందుకు చేస్తున్నారో? ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? అనే విషయాలను ముందుగానే పసిగట్టవచ్చు.
ఇక ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సైబర్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ యూజర్లకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చామని ట్రూ కాలర్ వ్యవస్థాపకులు చెబుతున్నారు. ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల.. సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తున్నారు.. పీసీలో నెంబర్లు తెలుసుకోవడం ద్వారా ఆస్తమానం ఫోన్ చూసే బాధ తప్పుతుందని.. కాంటాక్ట్ లో లేని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు గుర్తుతెలియని నెంబర్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.. ఎస్ఎంఎస్ ఇన్ బాక్స్ రీడ్ చేయడం ద్వారా.. అనవసరమైన సందేశాలను అక్కడికక్కడే డిలీట్ అనవసరమైన సందేశాలను అక్కడికక్కడే డిలీట్ చేయొచ్చు. మెసేజ్ అలర్ట్ పొందడం ద్వారా.. ఫోన్ చూడకుండానే కార్యకలాపాలు సాగించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం.. త్వరలో ఐఫోన్ యూజర్లకు కూడా కల్పిస్తామని ట్రూ కాలర్ బాధ్యులు చెబుతున్నారు.