Lost iPhone how to find: మనలో చాలామందికి యాపిల్ ఫోన్ అంటే చాలా ఇష్టం.. ఆ ఫోన్ వాడటాన్ని చాలామంది స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు. యాపిల్ కంపెనీ కూడా ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. వాటి ధర కూడా ఒక రేంజ్ లోనే ఉంటుంది. అయినప్పటికీ యాపిల్ ఫోన్ కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తుంటారు. యాపిల్ కంపెనీకి అమెరికా కంటే భారతదేశమే అతి పెద్ద మార్కెట్. ప్రతి ఏడాది యాపిల్ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులు మనదేశంలో భారీగా అమ్ముడుపోతుంటాయి.. స్మార్ట్ ఫోన్ నుంచి మొదలు పెడితే లాప్ టాప్ వరకు యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు భారీగా ధర ఉన్నప్పటికీ చాలామంది కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కొందరైతే క్రెడిట్ కార్డులను కూడా వినియోగిస్తుంటారు. అంతిమంగా యాపిల్ ఉత్పత్తులను సొంతం చేసుకుని.. అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఉత్పత్తుల పనితీరు చాలా బాగుంటుంది. పైగా అవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంటాయి. కెమెరా నుంచి మొదలు పెడితే వీడియోల వరకు ఇలా ప్రతి విషయంలోనూ యాపిల్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పరికరాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్ కు విపరీతమైన ధర ఉంటుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ పొరపాటున యాపిల్ ఉత్పత్తి చేసిన ఐఫోన్ పోతే.. ఎక్కడైనా పెట్టి మర్చిపోతే.. చాలామంది కంగారుపడుతుంటారు. కొందరైతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంటారు. అయితే అలాంటి అవకాశం లేకుండానే Anti theft shortcut ఐఫోన్ ఎక్కడ ఉందో సులభంగా కనిపెట్టవచ్చు. Anti theft shortcut ఉపయోగించడం కూడా చాలా సులభం.
Anti theft shortcut కీ వర్డ్ ను ఐఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలంటే..
ముందుగా when స్క్రీన్ లో message contains అనే ఆప్షన్ ఉపయోగించాలి.
పాప్ అప్ బాక్స్ లో కీ వర్డ్ లేదా ఏదైనా ఒక వాక్యం ఎంటర్ చేయాలి.
అనంతరం when స్క్రీన్ లోకి రావాలి.. run immediately అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇది పూర్తయిన తర్వాత next బటన్ ట్యాప్ చేయాలి. తద్వారా షార్ట్ కట్ రెడీ అయిపోతుంది.
ఇది పూర్తయిన తర్వాత మీరు వాడే ఐఫోన్ లో షార్ట్ కట్స్ యాప్ ను ఓపెన్ చేసి.. ఆటోమేషన్ ను టాప్ చేయాలి. ఆపై(+) బటన్ ను క్లిక్ చేయాలి. అనంతరం when screen లో మెసేజ్ ను ఎంచుకోవాలి. అది మీరు వాడే ఐఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంది. ఇది ఒక రకంగా షార్ట్ కట్ అమలు చేయమని చెప్పే సిగ్నల్ లాంటిది కూడా. టెక్స్ట్ మెసేజ్ పంపేందుకు మీకు బాగా ఇష్టమైన వ్యక్తుల ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఉత్తమం.
ఈ షార్ట్ కట్ చేసుకున్న తర్వాత.. ఒకవేళ మీ ఫోన్ పోయినా.. ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా.. అప్పుడు ఫోన్ లో ఉన్న రహస్య కెమెరా ఫోటోపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అలాగే మ్యాప్స్ తో లింక్ చేస్తే లైవ్ లొకేషన్ కూడా.. మీరు టెక్స్ట్ మెసేజ్ పంపిన డివైస్ కు వస్తుంది. అంతేకాదు భారీగా శబ్దం వచ్చే లా అలారం మోగుతూ ఉంటుంది.