Chat GPT : ప్రస్తుతం మనం స్మార్ట్ కాలంలో ఉన్నాం. ఆండ్రాయిడ్ దశలను దాటేసి చాట్ జిపిటి లోకి వచ్చేసాం. గూగుల్ జెమిని, మెటా, గ్రూక్, డీప్ సీక్ వంటివి టెక్నాలజీలో సరికొత్త మార్పులకు కారణమవుతున్నాయి. ఈ మారుతున్న టెక్నాలజీ తగ్గట్టుగానే మనుషుల జీవితాల్లో కూడా సమూల మార్పులు వస్తున్నాయి. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మనిషిని అత్యున్నత సాంకేతిక ప్రపంచంలో జీవించేలా చేస్తున్నది. పెరిగిన సాంకేతికత వల్ల నిరుద్యోగం రేటు పెరుగుతోందని.. ఉన్న ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని.. ఇలానే కొనసాగితే మనిషి జీవితాన్ని.. జీవన గమనాన్ని టెక్నాలజీ శాసిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాట్ జిపిటి ని చాలామంది తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం.. లోతైన విశ్లేషణ కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఒక యువకుడు మాత్రం చాట్ జిపిటిని పుచ్చకాయ కొనడానికి ఉపయోగించాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే.. అది కాస్త సంచలనంగా మారింది.
Also Read : అమ్మకానికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్.. కారణం ఇదే?
ఇంతకీ ఏం చేశాడంటే
మార్కెట్లో మనకు ఎన్నో రకాల వస్తువులు కనిపిస్తుంటాయి. అందులో మనకు అవసరమైన వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఏది నాణ్యమైనదో మనకు అంతగా తెలియదు. ముఖ్యంగా ఎండాకాలంలో పండ్లను కొనుగోలు చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనం మోసపోతుంటాం. పైకి నాణ్యంగా కనిపించినప్పటికీ.. లోపల పండ్లు కుళ్ళిపోయి ఉంటాయి. అలాంటి సమస్య తనకు ఎదురుకాకుండా ఉండడానికి ఓ వ్యక్తి చాట్ జిపిటి సహాయం తీసుకున్నాడు. ఒక పుచ్చకాయ కొనడానికి అతడు మార్కెట్ కి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల పుచ్చకాయలను చూశాడు. ఎందుకో తనకు చాట్ జిపిటి సహాయం తీసుకోవాలి అనిపించింది. వేరే మాటకు తావు లేకుండా చాట్ జిపిటిని ఆన్ చేశాడు. మార్కెట్లో ఉన్న పుచ్చకాయలను స్కాన్ చేశాడు. ఇంకేముంది చాట్ జిపిటి నాణ్యమైన పుచ్చకాయను చూపించింది. అది ఎర్రగా, తీయగా ఉంటుందని చాట్ జిపిటి సూచించింది. దీంతో ఆ వ్యక్తి పుచ్చ కాయను కొనుగోలు చేసి.. దానికి తగ్గట్టు డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడు. ” టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. చివరికి ఎలాంటి పండ్లు కొనాలో కూడా చెబుతోంది. టెక్నాలజీ ఇన్ని మార్పులకు కారణమైన తర్వాత మనిషి జీవితం మాత్రం మారకుండా ఎలా ఉంటుంది?.. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో టెక్నాలజీ ఇంకా ఎన్ని మార్పులకు గురవుతుందో చూడాలి.. కొత్త కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చి మనిషి జీవితాన్ని ఎలాంటి మార్పులకు పూచేస్తాయో చూడాలని” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram