Spam Calls: ప్రస్తుత కాలంలో Spam కాల్స్ బెడద తీవ్రమైంది. చాలావరకు తెలియని నెంబర్ నుంచి ఫోన్లు వస్తూ ఉంటున్నాయి. అయితే ఇవి అవసరమైన వా? ఉపయోగం లేనివా? అని తెలుసుకునే లోపే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉంటే ముఖ్యమైన కాల్స్ అయితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వీడికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు. అయితే ప్రభుత్వం ఆమోదించిన ఈ విధానం ద్వారా అనవసరపు కాల్స్ రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. అదేంటంటే..?
స్పామ్ కాల్స్ రాకుండా ఉండడానికి ప్రధానంగా మూడు మార్కాలు ఉన్నాయి. వాటిలో Regulatory Authority of India (TRAI) ద్వారా ఫేక్ కాల్స్ ను నివారించవచ్చు. ముందుగా ఒక మెసేజ్ పంపి దీనిని ఆక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Do Not Disturb(DND) సర్వీస్ ద్వారా కాల్స్ రాకుండా అడ్డుకోవచ్చు. అందుకోసం ముందుగా మెసేజ్ బాక్స్ లోకి వెళ్లి START 0 అని టైప్ చేసి 1909 అనే నెంబర్కు మెసేజ్ పంపించాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ప్రమోషనల్ కాల్స్, మెసేజ్లు పూర్తిగా బ్లాక్ చేయబడతాయి. అలాగే 1909 DND సర్వీసును పెంచుకొని ఆక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ యాక్టివేట్ అయినా ఏడు రోజుల తర్వాత ప్రమోషనల్ కాల్స్ రాకుండా ఉంటాయి.
మొబైల్ లోను కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా స్పామ్ కాల్స్ రాకుండా చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారు Google అనే యాప్ లోకి వెళ్ళాలి. ఇందులో రైట్ సైడ్ పైన ఉన్న త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు Caller ID and Spam Protection అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇప్పుడు filter spam calls లేదా black spam calls నువ్వు ఎంచుకోవడం ద్వారా అన్ని రకాల కాల్స్ ఆఫ్ అయిపోతాయి.
అలాగే ఎప్పుడూ ఒకే నెంబర్ నుంచి కాల్స్ పదేపదే రావడం వల్ల.. ఆ నెంబర్ పై 1909 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం వల్ల కూడా అవాంఛిత కాల్స్ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రతిరోజు విద్య, వైద్యం, ఈ కామర్స్ కు సంబంధించిన అనేక కాల్స్ వస్తూ ఉంటాయి. వీటివల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు ఇటువంటి కాల్స్ వచ్చి ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే ప్రత్యేకంగా వీటికి అడ్డుకట్ట వేయడానికి ఈ మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా నేరుగా ఆయా నెట్వర్క్ ఆఫీస్ లోకి వెళ్లి కూడా ఫిర్యాదు చేయడం వల్ల స్పాం కావాల్సిన అడ్డుకోవచ్చు.