Chicken: ఒకప్పుడు పండగలకు, చుట్టాలు వస్తే మాత్రమే చికెన్ తినేవారు. కానీ ప్రస్తుతం ప్రతి వారం చికెన్ తినే వారి సంఖ్య పెరిగింది. ఇక కొందరు అయితే మాంసం లేకపోతే ముద్ద దిగదు అన్నట్టుగా తింటున్నారు. వారంలో రెండు మూడు సార్లు కూడా చికెన్ ఉంటుంది. అయితే చికెన్ అతిగా తినకూడదు అంటారు నిపుణులు. కానీ ప్రస్తుతం ఈ చికెన్ తినడం వల్ల ఏకంగా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు.
చికెన్ త్వరగా అమ్మకాలు చేయాలి. లాభాలు అధికంగా రావాలనే ఉద్దేశ్యంతో కోడికి ఎక్కువగా యాంటీ బయోటిక్స్, హార్మోన్స్ ఇస్తుంటారు. వీటి వల్ల కోడి వారంలోనే చేతికి వస్తుంది. ఈ కోడిని అమ్మడం ద్వారా వారికి ఎక్కువ లాభాలు వస్తుంటాయి. ఇక ఇది తెలియని వారు చికెన్ తింటున్నారు. రెస్టారెంట్ లో కల్తీ, హోటల్స్ లో కల్తీ, పోనీ ఇంట్లో అయినా చేసుకొని తినాలి అంటే కోడి కల్తీ అని బాధ పడుతున్నారు మాంసం ప్రియులు.
అయితే ఇలాంటి కల్తీ కొన్ని కోల్ల ఫారమ్స్ లో మాత్రమే జరుగుతుంది. కానీ వాటిని తెలుసుకొని తీసుకొని రావడం మాత్రం ముఖ్యం. కానీ గ్రామాల్లో ఉండేవారు అదృష్ట వంతులు కదా. కల్తీ లేని కూరగాయలు, మాంసం తినే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. సో మీరు ఏది తినాలన్నా కాస్త ఆలోచించి, పరీక్షించి తినడం మంచిది. లేదంటే ఇలాంటి ఆహారాలను తింటూ అనారోగ్య పాలు అవ్వాల్సిందే.
ఈ హార్మోన్లు, యాంటీ బయోటిక్ ఇచ్చిన కోళ్లను తినడం వల్ల నెమ్మనెమ్మదిగా బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయట. ప్రస్తుతం రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులో మరొక కారణం ఇలాంటి కోళ్లు అని కూడా అంటున్నారు నిపుణులు. సో కాస్త జాగ్రత్త పడాల్సిందే.
ఈ వార్త కేవలం సోషల్ మీడియాలో ఉన్న సమాచారం, నిపుణుల సలహాల మేరకు మాత్రమే మీకు అందిస్తున్నాము. దీన్ని ఒకే తెలుగు నిర్దారించదు.