Blood Moon Eclipse: ప్రతి ఏడాదిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడతాయి. 2025-26 సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మార్చి 14న మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఇది భారతదేశంలో కనిపించలేదు. అందువల్ల ఇక్కడ సూతకాలం పనిచేయలేదు. రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7న రాత్రి 9: 58 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న ఉదయం 1:26 గంటలకు ముగుస్తుంది. మొత్తం 3:28 గంటలపాటు చంద్రగ్రహణం ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేయనున్నారు. అంతేకాకుండా ఇక్కడ సూతకాలం పనిచేయనుంది. అయితే ఈరోజు మరో విశేషం జరగనుంది. అదేంటంటే?
చంద్రగ్రహణం సందర్భంగా భారతదేశంలో సూత కాలం పనిచేస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది రాహుగ్రస్తా చంద్రగ్రహణం అయినందువల్ల.. రాహు-కేతు పూజలు చేయడం వల్ల శుభాలు జరుగుతాయని కొందరు చెబుతున్నారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పేర్కొంటున్నారు. ఈ సమయంలో విష్ణు సహస్రనామం .. దుర్గ చాలీసా పఠించడం వల్ల అంతా శుభం జరుగుతుందని తెలుపుతున్నారు. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార, పానీయాలు తీసుకోకూడదని పండితులు పేర్కొంటున్నారు. అలాగే గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించడం మంచిదని అంటున్నారు. ఈ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. అందువల్ల దైవ దర్శనానికి వెళ్లేవారు ప్రత్యేక ప్లాన్ వేసుకోవాలని అంటున్నారు. గ్రహణం సందర్భంగా ఈరోజు ఎవరికైనా దానాలు చేస్తే శుభం జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు.
అలాగే ఈరోజు మరో విశేషం జరగనుంది. ఈరోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అంటారు. గత మార్చి 14న ఏర్పడిన చంద్రగ్రహణం రోజు కూడా బ్లడ్ మూన్ ఏర్పడింది. అయితే ఇది భారతదేశంలో కనిపించలేదు. సెప్టెంబర్ 7న ఏర్పడే బ్లడ్ మూన్ భారత దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. భారత్లోని ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ నగరవాసులు దేనిని స్పష్టంగా చూడవచ్చు. అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రుడికి, సూర్యుడికి భూమి అడ్డుగా వస్తుంది. దీంతో భూమి పైనుంచి వడపోసిన కిరణాలు లాగా కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడు ఈ సమయంలో ఎర్ర గా కనిపిస్తాడు.
బ్లడ్ మూన్ ను ఎవరైనా చూడొచ్చు. అయితే భారతదేశంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున సూత కాలం పాటిస్తారు. ఈ సమయంలో చంద్రగ్రహణం చూడొద్దని అంటారు. కానీ కొందరు మాత్రం చూడచ్చని పేర్కొంటున్నారు. సూర్యగ్రహణ సమయంలో అతినీల లోహిత కిరణాలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో చూడొద్దు.. కానీ చంద్రగ్రహణం చూడొచ్చని అంటున్నారు. అయితే సాంప్రదాయం ప్రకారం మాత్రం ఏ గ్రహణమైన నేరుగా చూడొద్దని కొందరు పండితులు చెబుతారు. సూర్యగ్రహణం ప్రత్యేక కళాధాల ద్వారా చూడాలని.. చంద్రగ్రహణం నేరుగా చూడవచ్చని ఇంకొందరు చెబుతున్నారు.