Instagram Threats
Instagram: సోషల్ మీడియా వినియోగం పెరిగింది. రకరకాల యాప్స్ వాడకం తారస్థాయికి చేరింది. అయితే ఇందులో ఎంత మంచి ఉందో, అదే స్థాయిలో చెడు కూడా ఉంది. ఈ చెడు రూపంలో చాలామంది హ్యాకర్లు రకరకాల రూపాల్లో యూజర్లను ఇబ్బంది పెడుతుంటారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇందుకు వారు అశ్లీల చిత్రాలు, వీడియోలతో బెదిరిస్తుంటారు. యూజర్ల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఇన్ స్టా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ గా నామకరణం చేసిన ఇన్ స్టా.. డిస్ ప్లే పిక్చర్ లలో దీనిని ప్రవేశపెట్టనుంది. ఇది నగ్న చిత్రాలను వెంటనే పసిగడుతుంది. అంతేకాదు ఆ తరహా చిత్రాలు, వీడియోలతో అపరిచిత వ్యక్తులు బెదిరిస్తే అడ్డుకుంటుంది. అలాంటి వాటిని షేర్ చేసే ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనిని మిషన్ లెర్నింగ్ ఆధారంగా ఇన్ స్టా అందుబాటులోకి తేనుంది. మిషన్ లెర్నింగ్ తో నగ్న ఫోటోలను పసిగడుతుంది. అంతేకాదు ఎవరికైనా రిపోర్టు చేస్తే తప్ప ఇన్ స్టా గ్రామ్ కంపెనీ కూడా వీటిని యాక్సెస్ చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు, వీడియోలు పంపించి డబ్బులు డిమాండ్ చేసే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారి బారిన పడకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఐతే టీనేజ్ పిల్లల్లో ఇన్ స్టా గ్రామ్ యాప్ లో ఇది డిఫాల్ట్ గా ఆన్ అయి ఉంటుంది..ఒకవేళ పెద్ద వాళ్ళయితే ఆన్ చేసుకోవాలని సూచిస్తుంది. ఇది ఆన్ అయిన తర్వాత ఎవరైనా నగ్న చిత్రాలు, వీడియోలు పంపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అప్పటికీ వారు అప్రమత్తం కాకుంటే అన్ సెండ్ అనే ఆప్షన్ ను ఆన్ లో ఉంచుతుంది. అప్పటికీ ఎవరైనా అసభ్య ఫోటోలు పంపిస్తే మెటా సేఫ్టీ టిప్స్ ఆన్ అవుతాయి. ఇవి నగ్న చిత్రాలు, వీడియోలను బ్లర్ చేస్తాయి. అంతే కాదు వార్నింగ్ స్క్రీన్ కూడా యాడ్ చేస్తాయి.
రోజురోజుకు సైబర్ ముఠాల ఆగడాలు పెరిగిపోతుండడం.. నగ్న ఫోటోలు, వీడియోలను పంపిస్తున్న నేపథ్యంలో ఇన్ స్టా గ్రామ్ మాతృ సంస్థ మెటా ఈ నిర్ణయం తీసుకుంది.. దీనివల్ల యూజర్ల భద్రత, గోప్యత కు ఎటువంటి భంగం వాటిల్లదని.. సైబర్ ముఠాల ఆగడాలకు చెక్ పెట్టొచ్చనేది మెటా ప్లాన్. ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా కొన్ని దేశాలలో ప్రారంభించింది. అయితే అది టెస్టింగ్ దశలో ఉన్న నేపథ్యంలో.. కొన్ని కొన్ని మార్పులు చేసి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని ఇన్ స్టా మాతృ సంస్థ మెటా భావిస్తోంది. ఇన్ స్టా మాత్రమే కాకుండా ఫేస్ బుక్ లో ఇలాంటి ఫీచర్ తీసుకొచ్చేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Are those kinds of threats coming on instagram stop it like this