Parker Solar Probe spacecraft : హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు గ్రహాంతరవాసులు ఉన్నారని కొంతమంది.. గ్రహాంతరవాసులు అనేవారు లేరని మరి కొంతమంది వాదనలతో ప్రపంచం రెండుగా విడిపోయింది.. అయితే తాజాగా సూర్యుడిపై కూడా ఏలియన్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రుడిపై ఉన్నట్టుగానే సూర్యుడిపై మచ్చలు అందువల్లేనని కొంతమంది వాదిస్తున్నారు. సూర్యుడి మీద ఉన్న మచ్చలు భూగ్రహం కంటే చాలా రెట్లు పెద్దవట. వాటిని డార్క్ స్పాట్స్ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. సూర్యుడి ఉపరితలం మీద ఆరువేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. నల్లమచ్చలు ఉన్నచోట మాత్రం భూష్ణోగ్రత తక్కువగా ఉంటుందట. ఆ నల్ల మచ్చల వద్దే ఏలియన్స్ నివసిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదని.. నల్ల మచ్చలు ఉన్నచోట గ్రహాంతర వాసులు నివసించడానికి అవకాశం లేదని ఇంకొంతమంది చెబుతున్నారు. ఈ వాదనలు సాగుతుండగానే
నాసా సూర్యుడి మీదికి “పార్కర్ సోలార్ ప్రొబ్” అనే వ్యోమ నౌకను పంపించింది. సూర్యుడి వేడికి అది కాలిపోకుండా అనేక రక్షణ చర్యలను చేపట్టింది. 930 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే విధంగా దానిని రూపొందించింది. శాస్త్రవేత్తల కృషి వల్ల వ్యోమ నౌక లోపలి ఉష్ణోగ్రత 29 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఈ వ్యోమ నౌక ప్రస్తుతం సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళింది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష సంస్థ కూడా సూర్యుడికి దగ్గరగా తమ వ్యోమ నౌకలను పంపలేదు. 2018లో “పార్కర్ సోలార్ ప్రొబ్” ను నాసా సూర్యుడి మీదకి పంపింది. ఏడు సంవత్సరాల పాటు ఈ వ్యోమనవక సూర్యుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇది ఇచ్చే సమాచారం ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు భూమి మీద చోటుచేసుకునే పరిస్థితులను, మార్పులను పరిశీలిస్తారు. సూర్యుడి ఉపరితల వాతావరణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తారు.. గత మంగళవారం “పార్కర్ సోలార్ ప్రొబ్” సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళింది. కానీ ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు ఒకసారి పరిశీలించిన తర్వాతే.. బయట ప్రపంచానికి తెలియజేశారు. ఇది చెప్పడానికి దాదాపు నాలుగు రోజుల వరకు సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు “పార్కర్ సోలార్ ప్రొబ్” నుంచి నాసా శాస్త్రవేత్తలకు ఎటువంటి సంకేతాలు రాలేదు. ఈ వ్యోమ నౌక భూమి నుంచి 61 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
గంటకు అంత వేగంతో
“పార్కర్ సోలార్ ప్రొబ్” గంటకు 6,90,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది సూర్యుడి గురించి అత్యంత లోతుగా అధ్యయనం చేస్తోంది. సూర్యుడి ఉపరితల పరిస్థితులను అంచనా వేస్తున్నది. ఇది వచ్చే ఏడాది మార్చి 22, జూన్ 19 న కూడా సూర్యుడి వద్దకు వెళుతుంది. ఇలా మూడుసార్లు సూర్యుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత.. సేకరించిన సమాచారాన్ని నా శాస్త్రవేత్తలకు అందిస్తుంది. అయితే ఇది ఇచ్చే సమాచారం కోసం నాసా శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యోమ నౌక ఏమైనా ఏలియన్స్ గురించి సమాచారం ఇస్తే.. ఆ సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తారు.. అయితే సూర్యుడిపై ఏలియన్స్ ఉన్నారనే ప్రచారాన్ని నాసా శాస్త్రవేత్తలు నమ్మడం లేదు. అదంతా కూడా అభూతకల్పన అని కొట్టి పారేస్తున్నారు.