Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAnthropic new AI model: ఆంత్రోపిక్ కొత్త మోడల్.. ఏఐ మొత్తం షేక్ అవ్వాల్సిందే

Anthropic new AI model: ఆంత్రోపిక్ కొత్త మోడల్.. ఏఐ మొత్తం షేక్ అవ్వాల్సిందే

Anthropic new AI model: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే టెక్నాలజీ రంగంలో సరికొత్త మార్పులకు కారణమవుతోంది. బ్యాంకింగ్ నుంచి మొదలు పెడితే హెల్త్ కేర్ వరకు అన్నిట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు పెరిగిపోయాయి. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంటే.. మిగతా కంపెనీలు ఇందులో కొత్త రకమైన విధానాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆంత్రోపిక్ అనే కంపెనీ ఒక అడుగు ముందుకేసి.. టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేసే పనిలో పడింది.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో శక్తివంతమైన మోడల్స్ వల్ల ఎంత సులభంగా అయితే పనులు జరుగుతాయో.. నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ప్రమాదాలను అంచనా వేయడానికి ఆంత్రో పిక్ ముందడుగు వేసింది. క్లాడ్ మితోస్ అనే టెక్నాలజీని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.. ఆంత్రో పిక్ సీఈఓ డారియో అమోడే ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.. తాము రూపొందించిన మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గేమ్ చేంజర్ అవుతుందని అమెరికా ప్రభుత్వ అధికారులతో చెప్పారు..

“నేటి కాలంలో సాఫ్ట్వేర్ ద్వారా జరిగే పనులు పెరిగిపోయాయి. అదే సమయంలో నేరాలు కూడా అదే స్థాయిలో ఎక్కువయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి అంటే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైకోత వ్యవస్థను రూపొందించాలి. అంతేకాదు సాఫ్ట్వేర్ మూల సమాచారాన్ని భద్రపరచాలి. అది పూర్తిగా సురక్షితంగా ఉండాలి. ఆ మోడీ మైతోస్ ద్వారా అది సాధ్యమవుతుంది. ఆంత్రోపిక్ సైబర్ సెక్యూరిటీ కోసం ట్రైనింగ్ ఇవ్వలేదు. కాకపోతే ఇది కోడ్ విధానంలో మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది. లోపాలను గుర్తించే విషయానికి వస్తే ఈ మోడల్ ప్రొఫెషనల్ హ్యూమన్ సెక్యూరిటీ పరిశోధకుడితో సమానంగా ఉంటుంది. లోపాలను గుర్తిస్తుంది. ఇంకా ఏవైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటాయి ముందుగానే హెచ్చరిస్తుందని” డారియో వెల్లడించారు.

ఆంత్రోపిక్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మైతోస్ ద్వారా ఓపెన్ బిఎస్డిలో 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న బగ్ ను గుర్తించింది. మితోస్ ద్వారా సైబర్ నేరాలను ముందుగానే గుర్తించవచ్చు. దానికోసం డిపెండర్ అనే వ్యవస్థను మైతోస్ అమలు చేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. బలమైన డిపెండర్ వ్యవస్థ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరింత సమర్థవంతంగా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ప్రయోగ దశలో ఉంది. ఇంకా కొన్ని దశలు పూర్తయితే అమల్లోకి వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular