Anthropic AI: ఏఐ.. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని హవానే. మంచి చెడుతో సంబంధం లేకుండా.. ఫలితాలు ఎలా ఉన్నా.. ఏఐని విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఇక ఈ ఏఐలో కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో అన్నిరంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. సునామీలా దూసుకొస్తున్న ఏఐతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ ఏఐని సునామీలా వర్ణించారు, సమాజమే సిద్ధంగా లేదని పేర్కొన్నారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఇంటర్వ్యూలో భారత ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, నైపుణ్యాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
వేగవంతమైన పురోగతి..
ఐదేళ్ల క్రితం కంప్యూటర్‌తో వ్యాసం రాయించడం అసాధ్యమైనది, ఇప్పుడు మానవ మెదడు స్థాయికి ఏఐ చేరింది. డేటా, కంప్యూటింగ్ శక్తి పెరగడంతో సామర్థ్యం ఆకాశానికి తాకుతోంది. ఆర్థిక, భద్రతా ప్రభావాలు కొందరికి నచ్చడం లేదు. అపార్థం కొంటున్నారు. అపోహలు పెంచుతున్నారు. సురక్షిత ఏఐ కోసమే ఓపెన్ ఏఐ వదిలేసి ఆంథ్రోపిక్ స్థాపించామని డారియో వెల్లడించారు.
భారత్‌తో భాగస్వామ్యం
బహుళజాతి సంస్థలు భారత్‌ను కేవలం మార్కెట్‌గా చూస్తునర్నాయి. ఇప్పుడుఆంథ్రోపిక్ కూడా ఇలాగే భారత్‌తో భాగస్వామ్యం కోరుకుంటోంది. ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది. ఏపీఐలతో స్వదేశీ సేవలు బలపడతాయి. ఉద్యోగాలపై ఎలాంటిపభావం ఉండదని డారియో వెల్లడించారు. గత అక్టోబర్ నుంచి వాడుక, ఆదాయం రెట్టింపు అయింది.
స్టార్టప్‌లకు సూచనలు..
భారత స్టార్టప్‌లు ఏపీఐలతో సరళ యూఐలు కాకుండా ఫైనాన్స్, బయాలజీలో అనుకరణ సాధ్యం లేని పరిష్కారాలు రూపొందించాలని డారియో తెలిపారు. ప్రతి 2–3 నెలలకు కొత్త మోడల్స్ వాడుకుని వినూత్నతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. సంక్లిష్ట ఏఐలు మానవ నిర్ణయాలు తీసుకుంటాయని సింథటిక్ డేటా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. దీనిపై నియంత్రణ అవసరమన్నారు. బయాలజిస్టుగా డారియో, ఏఐతో క్యాన్సర్‌కు కీమో థెరపీలు, పెప్టైడ్ చికిత్సలు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోడింగ్‌లాంటి సాఫ్ట్వేర్ పనులను ఏఐ ఆక్రమిస్తోంది. మానవ సంబంధాలు, భౌతిక పనులు, సంస్థల మధ్య సంనాదాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఫేక్ కంటెంట్‌ను గుర్తించే విమర్శనాత్మక ఆలోచన అవసరమని డారియో అభిప్రాయపడ్డారు.