WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను ఇంటర్‌డ్యూస్ చేస్తోంది. ఎన్నో ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది. తాజాగా వాట్సాప్ మరో అమేజింగ్ ఫీచర్స్‌తో రాబోతోంది. ఈ ఫీచర్‌తో మన యాప్‌కు మనకు నచ్చిన రంగు ఎంపిక చేసుకోవచ్చు. వీడియోకాల్ మాట్లాడుతూనే ఆడియో సాంగ్‌ను షేర్ చేసుకోవచ్చు.
బీటా వర్షన్..
వాట్సాప్ బీటా వర్షన్ ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌తో కళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని మెటా చెబుతోంది. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్ మోడ్ అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిని కొత్తగా అప్‌డేట్ చేయాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. యూజర్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్‌లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్ గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్‌బార్‌ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి తక్కువ కాంతిని ఇచ్చేలా అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
వీడియోకాల్ మాట్లాడుతూ..
ఇక మరో ఫీచర్ వాట్సాప్ వీడియోకాల్ మాట్లాడుతూనే మ్యూజిక్ ఆడియో ఫైల్‌ను షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో వీడియోకాల్ మాట్లాడుతుండగా, షేర్ చేసే అవకాశం ఉండేది. కాదు. కానీ, కొత్త ఫీచర్‌లో ఈ ఆప్షన్ ఉంటుందని తెలుస్తోంది. వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్, కంప్యూటర్ల నుంచి సైతం డేటాను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
యాప్‌కు నచ్చిన కలర్..
ఇక వాట్సాప్‌లో వచ్చే మరో పీచర్ యాప్‌కు మనకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవడం. ప్రసుత్తం వాట్సాప్ యాప్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అందరి ఫోన్లలో ఇదే రంగు కనిపిస్తుంది. ఇకపై అలా ఉండదు. మనకు నచ్చిన రంగులోకి యాప్‌ను మార్చుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.