Amazing Treadmill : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు.. వెనుకటికి కరెంట్, మర మగ్గాలు లేనప్పుడు చేనేతలు, వండ్రంగి, కంసాలి ఇలా ఎందరో ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేశారు. అప్పుడీ సోషల్ మీడియాలో లేకపోవడంతో వారి ప్రతిభ కేవలం గ్రామాలకే పరిమితమైంది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏ మారుమూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. వారి ప్రతిభ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ వడ్రంగి వినూత్న ఆవిష్కరణ చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Anand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..
సాధారణంగా మనం వాకింగ్ చేయడానికి ట్రెడ్ మిల్ వాడుతాం. దానిపై కరెంట్ ఆన్ చేసి మోటార్ నడుస్తుండగా వాకింగ్ చేస్తాం. కరెంట్ లేకపోతే ఆ మిషన్ నడవదు. కానీ ఇప్పుడు కరెంట్ లేకపోయినా నడిచే ఓ సరికొత్త మిషన్ ను ఓ వడ్రంగి ఆవిష్కరించాడు. అదిప్పుడు సంచలనమైంది.
అరుణ్ భగవతులా అనే నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వడ్రంగి కేవలం చెక్కల సాయంతో కరెంట్ అవసరం లేకుండా వాకింగ్ చేసేలా ఒక క్రమపద్ధతిలో వాటిని ఎత్తు నుంచి దిగువకు అమర్చి అద్భుతంగా ట్రెడ్ మిల్ తయారు చేశాడు. దానికి కరెంట్ అవసరం లేదు. ఈజీగా దానిమీద నడుస్తూ వెళ్లిపోవచ్చు.
Also Read: Congress Party: శరణు కోరినవారే భస్మాసూర ‘హస్తం’ అంటున్నారు..!
ఈ పవర్ అవసరం లేని ట్రెడ్ మిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రతిభకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
Amazing treadmill that works without power. pic.twitter.com/iTOVuzj6va
— Arunn Bhagavathula చి లిపి (@ArunBee) March 17, 2022