Best camera phones: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు దాదాపు అందరి చేతుల్లో ఉంది. వివిధ అవసరాల కోసం స్మార్ట్ మొబైల్ కొనక తప్పడం లేదు. అయితే అప్డేట్ అవుతున్న కొద్దీ కొత్త ఫోన్లను కొనాల్సి వస్తోంది. ఇలాంటి వారి అవసరాలకు అనుగుణగా కంపెనీలు పోటీ పడి ఎన్నో రకాల మొబైల్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ ఏదీ బెస్ట్? అనేది చాలా మంది తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా యూత్ మొబైల్స్ కోసం తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని మొబైల్స్ లో ది 5 బెస్ట్ ప్రొడక్ట్ ను కొందర నిపుణులు సూచించారు. వారు తెలుపుతున్న ప్రకారం.. ఈ 5 మొబైల్స్ వినియోగదారులకు అనుగుణంగా ఉంటయని అంటున్నారు. మరి అవేవో చూద్దాం..
Samsung కంపెనీ గురించి తెలియంది కాదు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మొబైల్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం Samsung Galaxy S 25 సూపర్ అని అంటున్నారు. దీనిని రూ. 1,07,999 ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో అద్భతమైన కెమెరా ఉంది. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే 500 మెగా పిక్సెల్ పెరిస్కోల్ లెన్స్, 10 ఎంపీ టెలిఫొటో, 50 ఎంపీ ఆల్ట్రానైట్ సెన్సార్ కెమెరాను అమర్చారు. మంచి కెమెరా కావాలని అనుకునేవారికి ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది.
చైనాకు చెందిన Vivo X 300 విజువల్స్ పరంగా ది బెస్ట్ మొబైల్ అంటున్నారు. ఇందులో ప్రో లెవల్ వీడియో పర్ఫామెన్స్ ఉంది. అలాగే OISతో పాటు 50 మెగా పిక్సెల్ వైడ్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. అలాగే మాక్రో సామర్థ్యంతో 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్ కలిగి ఉంది.
సెల్పీ కోసం అయితే గూగుల్ పిక్సెల్ 10 ప్రో అనుగుణంగా ఉంటుంది. దీనిని రూ.1,09,999తో విక్రయిస్తున్నారు. ఇందులో 42 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరాను అమర్చారు. 4 కె రికార్డింగ్ తో వీడియో షూట్ అవుతుంది. అలాగే 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కలగిన కెమెరాను అమర్చారు. ఇక పవర్ ఫుల్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీని కలిగి ఉంది.
Oppo నుంచి Find X 9 మొబైల్ ఆకర్షిస్తోంది ఇందులో అత్యుత్తమమైన కెమెరా ఉందని కొనియాడుతున్నారు. 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో తో పాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ ను కలిగి ఉండడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే డాల్పీ విజన్ వీడియో, ఎల్ వోజీ రికార్డింగ్ వంటివి ఆకర్షిస్తాయి.
iPone 17 ప్రో మాక్స్ ది బెస్ట్ మొబైల్స్ లో ఒకటిగా ఉంది. దీని ధర రూ.1,49,900 గా ఉంది. ఇందులో 49 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో, అడ్వాన్స్ ట్రిపుల్ లెన్స్ సెటప్ కలిగి ఉంది. అద్భుతమైన కెమెరా ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఇది ఒకటిగా నిలుస్తోంది.