https://oktelugu.com/

RRR Release Date: ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా?… స్వయంగా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

RRR Release Date: మరో వారం రోజుల్లో ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో ఓ విజువల్ వండర్ చూడాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో వాళ్ళను వాయిదా ఊహాగానాలు, పుకార్లు భయపెడుతున్నాయి. గతంలో మూడు సార్లు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఈ వార్తలను కొట్టిపారేయలేమని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కోసం అన్ని రకాల అవరోధాలు ఎదురుచూస్తున్నాయి మరి. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 30, 2021 1:46 pm
    Follow us on

    RRR Release Date: మరో వారం రోజుల్లో ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో ఓ విజువల్ వండర్ చూడాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో వాళ్ళను వాయిదా ఊహాగానాలు, పుకార్లు భయపెడుతున్నాయి. గతంలో మూడు సార్లు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఈ వార్తలను కొట్టిపారేయలేమని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కోసం అన్ని రకాల అవరోధాలు ఎదురుచూస్తున్నాయి మరి.

    RRR Release Date

    RRR Release Date

    దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా న్యూ వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టాయి. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ థియేటర్స్, స్కూల్స్ మూసివేశారు. కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో సైతం కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ అమలవుతుంది.

    తెలుగు తర్వాత టాలీవుడ్ చిత్రాలకు అతిపెద్ద మార్కెట్ గా బాలీవుడ్ ఉంది. మరి నార్త్ ఇండియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మహారాష్ట్రలో థియేటర్స్ నడుస్తున్నప్పటికీ 50 శాతం సీటింగ్ కి మాత్రమే అనుమతి ఉంది. దీంతో భారీ, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల వాయిదా వేసుకుంటున్నాయి. షాహిద్ కపూర్ నటించిన జెర్సీ చిత్రం డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు.

    Also Read: ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !

    మరి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదల చేయడం సవాలే. ఓపెనింగ్స్ ని బాగా దెబ్బతినే అవకాశం కలదు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా వేస్తారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ప్రకటించిన విధంగా జనవరి 7న విడుదల చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ధృవీకరించారని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.

    ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే సమయంలో అనుకున్న సమయం కంటే ఏడాది ఆర్ఆర్ఆర్ విడుదల ఆలస్యమైంది. దీంతో నిర్మాతపై బడ్జెట్ భారం పడింది. డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రయాణం సాగరం మధ్యలో ఉండగా… వెనక్కి వచ్చేది లేదు. ఏది ఏమైనా తీరం చేరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఈ వారం రోజుల్లో లాక్ డౌన్ సంభవించకపోతే ఆర్ఆర్ఆర్ జనవరి 7న థియేటర్స్ లో దిగిపోతుంది.

    Also Read: ఆర్ఆర్ఆర్ పై ఢిల్లీ ఎఫెక్ట్.. అయినా రిలీజ్ ఖాయం.. కారణం అదే!

    Tags