Akhanda Godavari tourism project: గోదావరి జిల్లాల ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు( Akhanda Godavari tourism project ) సాకారం కానుంది. రూ. 94 కోట్లతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కడియం, నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించగలిగేలా తీర్చిదిద్దుతున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టున్నారు.
పుష్కర ఏర్పాట్లు
2027 లో గోదావరి పుష్కరాలు( Godavari festivals ) జరగనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.375 కోట్లతో ఏపీ టూరిజం అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగానే ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. హేవాలక్ వంతెన పునర్నిర్మాణం, ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, గోదావరి నిత్య హారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంకా, నిడదవోలు, ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
Also Read: Visakhapatnam: విశాఖపై జపాన్ దాడి.. చారిత్రక ఉద్రిక్తతల నీడలో ఒక నగరం
హైదరాబాదు నుంచి నేరుగా పవన్..
సాధారణంగా గోదావరి జిల్లాలో అంటే పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan ) చాలా ఇష్టం. అందుకే అక్కడ పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈరోజు ఆ నిర్మాణాలకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నడంతో పవన్ పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. 8:35కి విమానం బయలుదేరి 9:30 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. తరువాత రోడ్డు మార్గంలో రాజమండ్రి పుష్కర ఘాట్ కు వెళ్తారు. ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రితో కలిసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు. 11:30 గంటలకు బొమ్మూరు లోని రీజనల్ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 12:40కి దివాన్ చెరువులోని ఫారెస్ట్ అకాడమీకి వెళ్తారు. అక్కడ నిర్మాణాలు పరిశీలిస్తారు.
Hon’ble Deputy CM Shri @PawanKalyan laid the foundation stone for the Akhanda Godavari Tourism Project and addressed the gathering,#PawanKalyanAneNenu pic.twitter.com/AWIwAQPyzc
— Venkat (@venkat_110) June 26, 2025
మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
మరోవైపు 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి వైఫల్యాలు లేకుండా చూడాలని భావిస్తోంది. తాజాగా గోదావరి పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని( cabinet Sab committee ) ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప సంఘంలో సభ్యులుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ ఉన్నారు .