Car Sales: భారత్ లో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కంపెనీ మారుతి. మారుతి కంపెనీ కార్లంటే కొంత మంది ఎగబడి కొంటారు. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని రకాల మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ కంపెనీ.. లేటేస్ట్ గా ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయి మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న మారుతి కార్లలో స్విప్ట్ ఒకటి. దశాబ్దాలుగా స్విప్ట్ కు క్రేజ్ తగ్గడం లేదు. రెండు నెలల కిందట స్విప్ట్ అప్డేట్ కారు వచ్చినప్పటికీ పాత కారుకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటి వరకు పాత స్విప్ట్ మొత్తం 30 లక్షల విక్రయాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
2005 సంవత్సరంలో మారుతి కంపెనీ నుంచి స్విప్ట్ రిలీజ్ అయింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 80.46 బీహెచ్ పీ పవర్ , 111.7 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసింది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగిన ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 24.8 నుంచి25.5 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అప్పటి నుంచి వివిధ వేరియంట్లను అప్డేట్ చేసుకుంటూ వస్తున్న స్విప్ట్ ఇప్పటికీ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
మారుతి సుజుకీ స్విప్ట్ నుంచి 4వ జనరేషన్ కారును మే 9న రిలీజ్ అయంది. అయినా పాత మోడల్ కు ఆదరణ తగ్గడం లేదు. 2005 నుంచి 2013 వరకు పాత స్విప్ట్ 10 లక్షల విక్రయాలు జరుపుకుంది.2018 వరకు 20 లక్షల విక్రయాలు జరిగాయి. 2024 వరకు ఈ మోడల్ 30 లక్షల మార్క్ దాటి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 65 లక్షలకు పైగా విక్రయాలు జరుపుకున్న ఈ హ్యాచ్ బ్యాక్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది.
మారుతి సుజుకీ స్విప్ట్ లో ఉండే ఫీచర్స్ ను దృష్టిలో ఉంచుకొని కారు వినియోగదారులు ఈ మోడల్ కోసం ఎగబడుతున్నారు. ఇందులో ఎల్ ఈడీ ల్యాంపులు, వైర్ లెస్ ఛార్జర్, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సేప్టీ కోసం ఇందులో యాంటీ లాకింగ్ బ్రేక్, ఎయిర్ బ్యాగ్స్, క్లైమేట్ కంట్రోల్ వంటివి ఆకర్షిస్తాయి. ఇక దీనిని రూ.6.49 లక్షల నుంచి విక్రయిస్తున్నారు. కొత్త స్విప్ట్ తో కలిపి మొత్తం 11 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్ ను బట్టి ధర మారుతూ ఉంటుంది.