AI for court hearing: Artificial Intelligence (Al) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగం దీనిని వాడుకుంటుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్, మెకానికల్ రంగంలో ఏఐ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. అయితే ఇప్పుడు న్యాయవ్యవస్థలో కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, వేగం, సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని న్యాయవాదులు భావిస్తున్నారు. అందుకే ఏఐ ఆధారిత విచారణ చేయబడుతున్నారు. ఇప్పటికే దేశంలోని 4,000 కోర్టులో ఏఐ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు ‘అదాలత్ ఏఐ’ టూల్ ను రూపొందించారు. ఈ టూల్ ఎలా పనిచేస్తుంది? న్యాయ వ్యవస్థలో విచారణకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
భారతదేశంలోని న్యాయ వ్యవస్థలో ఏఐ ఇంటర్ ఇవ్వడం ఒక విప్లమాత్మక మార్పు అని భావిస్తున్నారు. ఇప్పటివరకు కోర్టు విచారణలో భాగంగా స్టెనో, టైపిస్టులు ఉండేవారు. కానీ ప్రస్తుతం వారి అవసరం లేకుండా ఏఐ రియల్ టైం సేవలను అందిస్తుంది. ఈ టోల్ ను ఇప్పటికే అదాలత్ ఏఐ రూపొందించింది. Adalat AI అనేది భారతీయ కోర్టుల కోసం రూపొందించిన న్యాయ సాంకేతిక పరిష్కారం. ఇది కోర్టు రూమును మొత్తంగా మార్చేస్తుంది. విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలను స్పీచ్ టు టెక్స్ట్ గా మార్చి సిద్ధం చేస్తుంది. సాధారణంగా వారి వాంగ్మూలాలను స్టెనోగ్రపర్లు, టైపిస్టులు చేసేవారు. అయితే వీరు ఎక్కువ సమయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏఐ ఈ పనిని చేస్తూ 50 శాతం సమయాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వారి అవసరం లేకుండా ఇది నిర్వహిస్తుంది.
స్పీచ్ టు టెక్స్ట్ భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను మార్చేస్తుంది. న్యాయవ్యవస్థ భాషలలో టెక్స్ట్ ను తయారుచేసి కోర్టు సమయానికి రికార్డులను సిద్ధం చేస్తుంది. తద్వారా న్యాయవాదులు, క్లర్క్ లు ఈ డాక్యుమెంటేషన్ త్వరగా తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ను డిజిటలైజేషన్ మార్చేస్తుంది. ఏ లాంగ్వేజ్ అనుకుంటే అందులోకి మారి రికార్డులను సిద్ధం చేస్తుంది.
ప్రస్తుతం ఈ విధానాన్ని 9 రాష్ట్రాల్లోని 4,000 కోర్టులో అమలు చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేరళలో నవంబరు ఒకటి నుంచి అన్ని జిల్లాల్లో రికార్డులను నమోదు చేయడానికి అదాలత్ ఏఐని వినియోగించాలని తప్పనిసరి చేశారు. ఇప్పటికే కొన్ని కోర్టులో అమలు చేయగా విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా విస్తరించినందుకు సిద్ధమవుతున్నారు. 2028 సంవత్సరం నాటికి 20,000 కంటే ఎక్కువగా కోర్టులోకి దీనిని ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐని ఉపయోగించడం ద్వారా కేసుల భారం తగ్గుతుంది. వాయిదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రజలకు వారి హక్కుల గురించి, కేసు తయారీ గురించి వేగంగా తెలిసిపోతుంది. అయితే ఏఐ ద్వారా కొన్ని సమస్యలు లేకపోలేదు. డేటా ప్రైవసీ, సరైన శిక్షణ లేకపోవడంతో ఇది అమలులో అంటున్నారు. కొన్ని న్యాయవ్యవస్థలు ఏఐ సేవలను వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో పారదర్శకత లేకపోవడం.. ఏఐ ఇచ్చే సమాచారానికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నిస్తున్నారు.