Pegasus Spyware: పెగాసస్ వ్యవహారం అప్పట్లో ఉభయ సభలను కుదిపేసింది. కేంద్రం ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్రం కూడా దీనిపై విచారణ చేపడతామని హామీ ఇచ్చినా తరువాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అయితే తాజాగా కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ పెగాసస్ వ్యవహారంపై మరోమారు తెర లేపారు. కేంద్రం ఇజ్రాయెల్ ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈమేరకు అమెరికా వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ కేంద్రంపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో మరోమారు పెగాసస్ వ్యవహారం రాజకీయ దుమారం రేపనుంది.
కేంద్రం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించగా దాన్ని చూపుతూ రాహుల్ ఈమేరకు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజల విలువలను తుంచుతూ తన ప్రభావాన్ని పెంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను నిరసించారు. స్వార్థంతో ఇలా చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి త్వరలో కాలం చెల్లుతుందని చెబుతున్నారు. ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించే ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు.
Also Read: టాప్ అప్ లోన్ అంటే ఏంటో తెలుసా.. ఈ లోన్ వల్ల కలిగే ప్రయోజనాలివే!
దీంతో పెగాసస్ వ్యవహారం మరోమారు పెంట చేయనుంది. ఉభయ సభల్లో నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అన్ని ఆధారాలు పట్టుకుని అడగనుంది. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే సూచనలే కనిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా ఎదుర్కోవాలని భావిస్తోంది.
ప్రతిపక్షాలను ఎదుర్కొనే క్రమంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి దేశంలో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి ఆలోచనలు తెలుసుకుని వారిని కట్టడి చేయడం కోసం దీన్ని ఉపయోగించడం గమనార్హం. దీంతో చాలా మంది ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా కలుగజేసుకుంది. దానిపై విచారణకు ఓ బెంచ్ ను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇందులో ఏది కూడా విజయవంతం కాలేదు. దీంతో మళ్లీ రగులుకున్న మొగలిపొద ఎప్పటికి చల్లారుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: కలబందను ఎక్కువగా వాడుతున్నారా.. ప్రమాదకరమైన సమస్యలు వచ్చే ఛాన్స్!