Add Place Google: నేటి కాలంలో చాలామంది ప్రయాణం చేసే ముందు మొబైల్లో గూగుల్ మ్యాప్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు.. ఒకవేళ గూగుల్ మ్యాప్ లేపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే ఇతరులను అడిగే బదులు గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్తూ ఉంటారు. గూగుల్ మ్యాప్ లో ముఖ్యమైన సంస్థల అడ్రస్లు.. కొన్ని ప్రముఖుల ఇళ్లకు సంబంధించిన దానిని చూపిస్తుంది. అయితే గూగుల్ మ్యాప్ లో కేవలం ఫేమస్ అయిన ప్రదేశాల గురించి మాత్రమే కాకుండా మీ ఇంటి గురించి కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. మీ ఇండ్లు లేదా వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ ఇతరులకు తెలియాలంటే గూగుల్ మ్యాప్ లో సెట్ చేసుకోవచ్చు. గతంలో ఇలా చేయాలంటే ఇతర సంస్థల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ మొబైల్ లోనే ఇప్పుడు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Also Read: ప్రతి ఒక్కరి పైనా నిఘా ఉంటుందా.. గూగుల్ మనల్ని ట్రాక్ చేస్తుందా ? సుందర్ పిచాయ్ సమాధానమిదీ
గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత contribution అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇందులో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో హోమ్ లేదా బిజినెస్ కు సంబంధించిన ఆప్షన్ లో ఉంటాయి. వీటిలో ఏది అవసరమైతే దానిని క్లిక్ చేసి అందులో వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయాలి. అప్పుడు గూగుల్ మ్యాప్ లో మీకు సంబంధించిన వివరాలు యాడ్ అయిపోతాయి. ఎవరైనా తెలియని వారు మీ ఇంటికి గాని లేదా.. వ్యాపార సముదాయానికి కానీ రావాలంటే ఆయా పేర్లు ఎంట్రీ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా గమ్య స్థలానికి చేరుకోవచ్చు.
అయితే గూగుల్ మ్యాప్ కూడా ఒక్కోసారి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. గతంలో గుజరాత్లో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణం చేయడం వల్ల వంతెన పైనుంచి కిందపడి ముగ్గురు మరణించారు. మరికొందరు గూగుల్ మ్యాప్ సహాయంతో ప్రయాణం చేయడం వల్ల దట్టమైన అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఫర్ఫెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా తప్పులు ఇవ్వడం వల్ల సంస్థపై లేదా మీపై ఇతరులకు చెడు అభిప్రాయం కలుగుతుంది.
Also Read:గూగుల్ మళ్లీ మొదలుపెట్టింది.. భవిష్యత్తు కాలం మొత్తం ఏఐ దే!
గూగుల్ మ్యాప్ ద్వారా చాలామంది ఎన్నో రకాలుగా ఉపయోగాలు పొందారు. దూర ప్రదేశాలకు వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్ సహాయంతోనే ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల డ్రైవర్లు దీని ఆధారంగానే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే సిటీలో లేదా నగరాల్లో అయితే గూగుల్ మ్యాప్ కాకుండా.. మానువల్ గా అడ్రస్ తెలుసుకుని వెళ్తే ప్రయోజనం ఉంటుంది. అలా వీలుగాని పక్షంలో గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రయాణించవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో నెట్వర్క్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్రదేశాల గురించి ముందే తెలుసుకొని ఉండాలి. ఆ తర్వాత ప్రయాణం చేయాలి.