Dehydration: మన శరీరంలో తగినంత నీరు లేకపోతే ఇబ్బందులు వస్తాయి. నీటి పరిమాణం తగ్గిందంటే పలు రోగాలు దరిచేరతాయి. అందుకే శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. శరీరం డీ హైడ్రేషన్ కు గురయితే కష్టమే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీరు ఉండాలి. లేకపోతే పేగులకు ఇబ్బంది కలుగుతుంది. పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.
శారీరక సమస్యలు
డీ హైడ్రేషన్ తో ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి. నీటి కొరత కారణంగా పేగులలో ఇబ్బందులు వస్తాయి. శరీరంలో నీటి కొరత వల్ల పేగుల పనితీరు మందగిస్తుంది. పొట్టలో పలు సమస్యలు ఏర్పడతాయి. పేగులలో వచ్చే సమస్యలతో మలబద్ధకం సమస్య ఎక్కువ కావడం జరుగుతుంది. నిర్జలీకరణ వల్ల మనకు వచ్చే సమస్యల గురించి ఆందోళన పడకుండా సమస్యను పరిష్కరించుకోవాలి.
గ్యాస్ సమస్యలు
శరీరంలో నీరు కొరతగా ఉన్నప్పుడు కాల్షియం, మెగ్నిషియం లేకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. కడుపులో పీహెచ్ స్థాయి దెబ్బతింటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి. దీంతో గ్యాస్ సమస్యలు కూడా ఏర్పడతాయి. నీటి కొరత లేకుండా చూసుకుంటే మంచిది. అందుకే జాగ్రత్తలు తీసుకుని డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి.
మలబద్ధకం
శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తే మలబద్ధకం కూడా సమస్యగా మారుతుంది. నీటి కొరత వల్ల పేగుల పనితీరు మందగిస్తుంది. పేగుల్లో కదలికలు లేకుండా పోతాయి. దీంతో మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది. ఇలా కడుపులో అనేక సమస్యలకు కారణమవుతుంది. నీటి కొరత లేకుండా చూసుకుని మన కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకుంటే ఇబ్బందులు ఉండవు.