Medicinal plant : మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో డయాబెటిస్ ఒకటి. 20 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8.7% మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. దానిని కంట్రోల్ ఉంచుకోవడం తప్పితే.. నివారణ కుదరదు. క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం, తీపి వస్తువులను పక్కన పెట్టడం, సరైన వ్యాయామం, మంచి పోషకాహారం తీసుకోవడం వంటి వాటితో డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే ప్రకృతి సిద్ధమైన ఔషధ మొక్కలతో డయాబెటిస్ ను నియంత్రించవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. రక్తంలో చక్కెరను తగ్గించడానికి, షుగర్ వ్యాల్యూస్ కంట్రోల్ లో ఉంచడానికి చాలా రకాల ఔషధ మొక్కలు దోహదపడతాయని పరిశోధనల్లో తేలుతోంది. మొన్న ఆ మధ్యన ఓ పరిశోధనలు బిళ్ళ గన్నేరు ఆకులను తింటే.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్పుకొచ్చారు. తాజాగా మరో అధ్యయనంలో షుగర్ లెవెల్స్ తగ్గించే మొక్క.. గయా పర్వతాల్లో ఉన్నట్లు గుర్తించారు. తమ పరిశోధనలో భాగంగా.. గుర్మార్ అనే మొక్క షుగర్స్ లెవెల్ ను తగ్గించే లక్షణం కలిగి ఉందని తేలింది. సుగర్స్ నియంత్రణ కోసం బి జి ఆర్ 34 అనే మందు తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి పరిశోధకులు గుర్మార్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో గయా పర్వతాలు వార్తల్లో నిలుస్తున్నాయి.
* బ్రహ్మయోని పర్వతంపై
బీహార్ లోని గయాలో బ్రహ్మ యోని పర్వతం ఉంది. ఈ పర్వతంపై ఔషధ గుణాలు ఉన్న ఎన్నో రకాల చెట్లు,మొక్కలు ఉన్నాయి. వాటిపై శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు. అందులో భాగంగా గుర్మార్ అనే మొక్కను గుర్తించారు. షుగర్ లెవెల్స్ ను తగ్గించే లక్షణం దీని సొంతం. ఈ వ్యాధి చికిత్స కోసం బిజిఆర్-34 అనే ఔషధ తయారీకి గుర్మార్ మొక్కను వినియోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమనిమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. తద్వారా తీపి పదార్థాలను తినాలన్న ఆకాంక్షను తగ్గించేస్తుంది. ఇది అంతిమంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి దోహదపడుతుంది.
* ఔషధ తయారీపై పరిశోధన
బ్రహ్మ యోని పర్వతంపై ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఔషధ తయారీకి అవసరమైన వృక్ష సంపద ఈ పర్వతంపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పర్వతం పై కనిపించిన వనమూలికలు అంతరించిపోకుండా ఉండేందుకు స్థానికుల సాయంతో సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనిపై బీహార్ ప్రభుత్వానికి కొన్ని రకాల సిఫారసులు కూడా చేశారు.అయితే వీటిని సంరక్షించే విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఔషధకారక మొక్కలు కావడం.. ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఆ మొక్కలను స్థానికులు సేకరిస్తున్నారు.
* ప్రమాదకరంగా వ్యాధి
వాస్తవానికి దేశంలో షుగర్ వ్యాధి విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా.. అన్ని వయసుల వారికి ప్రబలుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజల ఆహార అలవాట్లలో తేడాలు రావడం, ఒత్తిడి జీవితం వంటి వాటితో షుగర్ వ్యాధి ప్రతి మనిషిలో కనిపిస్తోంది. దీనిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రకరకాల అధ్యయనాలు చేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More