AP Job Calendar: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పూర్తిగా కసరత్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తెలుగు కొత్త సంవత్సరం నాడు జాబ్ క్యాలెండర్ విడుదల కు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకే ఇప్పుడు అధికారులు శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ విషయంపై కూడా ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దాని ప్రాప్తికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.
* ఆర్థిక శాఖకు ఫైల్..
ఏ ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఆర్థిక శాఖ( financial department) అనుమతి తప్పనిసరి. అందుకే ఇప్పుడు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ ఆర్ ఎం ఎస్ పోర్టల్ లో వివరాలు నమోదు చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా.. వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి బత్తికి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను సైతం నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
* మరో డీఎస్సీ..
గత ఏడాది 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ ( DSC )అనేది ఒక సంవత్సరంకు మాత్రమే పరిమితం చేయకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తోంది. ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రంగం సిద్ధం అవుతోంది. ఇంతలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను సేకరిస్తోంది. అందులో భాగంగా 1507 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపు 99 వేల ఉద్యోగాలు డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
* రెవెన్యూ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 13 వేల ఉద్యోగాల భర్తీ జరగనున్నట్లు సమాచారం. ఇదే శాఖలో ఏడు హెచ్వోడీలు, 4787 ఇతర ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. నేరుగా నియామకాలు చేపట్టాల్సినవి 2552గా గుర్తించారు.
* ఉన్నత విద్యా శాఖలో 7000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. యూనివర్సిటీలో మరో మూడు వేలు ఖాళీలు గుర్తించినట్లు తెలుస్తోంది.
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 27 వేల ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. అందులో సుమారు 23000 భక్తి చేస్తారని తెలుస్తోంది.
* నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.
* వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. డి ఆర్ పోస్టులు 2400.
* పంచాయితీ రాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26 వేలు. ఇన్ సర్వీస్ పదోన్నతులతో మరో మూడు వేల పోస్టులు భర్తీ చేయవచ్చు. ఇలా దాదాపు లక్ష పోస్టులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అందుకే ఉగాది నాటికి ఎన్ని పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలవుతోంది అనేది హాట్ టాపిక్ అవుతోంది.