2026 New Phones: స్మార్ట్ కాలంలో రోజురోజుకు సాంకేతిక పరికరాల అవసరం పెరిగిపోతోంది. ఇందులో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. అందువల్లే, కంపెనీలు రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 5జీ విప్లవం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దానికి తగ్గట్టుగానే ఫోన్ లను రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది స్మార్ట్ ప్రపంచాన్ని మార్చే విధంగా కొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇంతకీ అవి ఏంటి? అందులో ఉన్న ఫీచర్లు ఏంటి? ఎంత ధరలో లభిస్తాయి? ఈ అంశాలపై ప్రత్యేక కథనం.
Oneplus turbo 6 series
చైనా సోషల్ మీడియా ని వేదికల ప్రకారం వన్ ప్లస్ కంపెనీకి ఏడాది సరికొత్త మోడల్స్ తీసుకురాబోతోంది. వన్ ప్లస్ టర్బో 6, వన్ ప్లస్ టర్బో 6వీ (Oneplus Turbo 6, oneplus turbo 6 v) వంటి మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రామాణికమైన టర్బో 6(oneplus turbo 6) లో స్నాప్ డ్రాగన్ 8s Gen4 chip set, 165 Hz రీ ఫ్రెష్ రేట్, 1.5K display, 80 వైర్డ్, 27W రివర్స్ వైర్డ్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తే భారీ 9,000 mAh బ్యాటరీ ఉన్నాయి.
టర్బో 6 వీ లో 144 Hz రిఫ్రెష్ రేట్, 6.8 అంగుళాల 1.5K OLED డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 ఎస్ Gen 4 SoC ఉంటాయి. ఈ సిరీస్ లలో లైట్ చేజర్ సిల్వర్, లోన్ బ్లాక్, వైల్డ్ గ్రీన్, ఫియర్ ప్లస్ బ్లూ, నోవా వైట్ రంగులు ఉన్నాయి. ఈ ఫోన్ల లో 16 GB RAM ఉంటుంది.
Honor power 2
హానర్ పవర్ 2(Honor power 2) దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 10,080 mAh బ్యాటరీ ఉంది. ఇది ఏకకాలం గా 22 గంటల వరకు పనిచేస్తుంది. 14.2 గంటల గేమింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 80 W వైర్డ్, 27 W రివర్స్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమన్ సిటీ 8500 ఎలైట్ ప్రాసెసర్ ఆధారంగా నడుస్తుంది. 1.5K రిజల్యూషన్, 8,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.79 అంగుళాల LTPS ఫ్లాట్ డిస్ ప్లే ను కలిగి ఉంది. వెనుక కెమెరా సెట్ అప్లో 50 MP ప్రధాన సెన్సార్, 16 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. నలుపు, నారింజ, తెలుపు రంగులలో ఈ మోడల్స్ లభ్యమవుతున్నాయి.
Oppo Reno 15 series
Oppo కంపెనీలో రెనో సిరీస్ లో రెనో 15, రెనో 15 ప్రో విడుదల కాబోతున్నాయి. ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, హోలో ఫ్యూజన్ టెక్నాలజీ, ప్రో మోడల్ గ్లాస్ విక్టస్ 2 తో పాటు 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఈ మోడల్స్ కలిగి ఉన్నాయి. కోకో బ్రౌన్, సన్ సెట్ గోల్డ్, గ్లేషియర్ వైట్, ట్వి లైట్ బ్లూ, అరోరా బ్లూ వంటిరంగుల్లో లభిస్తున్నాయి. అన్ని మోడల్స్ లో IP 66+ IP68+ IP69 వంటి ప్రొటెక్షన్ ఉంటుంది.
Realme 16 Pro series
Realme 16 Pro series లో భాగంగా జనవరి 6న వారి రియల్ మీ 16 ప్రో, రియల్ మీ 16 ప్రో ప్లస్ ను లాంచ్ చేయనుంది. 200 మెగా ఫిక్సల్ కెమెరా సెన్సార్ ను కలిగి ఉన్నాయి. ప్రో ప్లస్ వేరియంట్ లో 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా సెన్సార్ కూడా ఉంది . మొత్తం ఆల్ మెటల్ డిజైన్ కలిగి ఉన్నాయి. ప్రో ప్లస్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్ శక్తితో ఇవి నడుస్తాయి. రియల్ మీ 16 ప్రో లో మీడియా టెక్ డైమన్ సిటీ ప్రాసెసర్ ఇందులో ఉంటాయి. ఇవే కాకుండా redmi కంపెనీ కూడా నోట్ 15 అనే మోడల్ ను లాంచ్ చేయనుంది. ఇందులో 4k వీడియో రికార్డింగ్, 108 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, స్లిమ్ 7.35 ఎంఎం బాడీ, 120 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్, వంపు తిరిగిన అమో లెడ్ డిస్ప్లే కలిగి ఉంది.
Tested by Vicky. Trusted in portraits.
From subtle details to confident frames, the #realme16ProSeries is built for portraits that feel real on Vicky, and on you.
Launching on 6th Jan, 12 PM.
Know More:https://t.co/Vk3a5ORmvH https://t.co/Ar1BcHr0iw… pic.twitter.com/ilBqhD8bnE
— realme (@realmeIndia) December 19, 2025