20-year-old girl beats Meta and Google: కొన్ని సందర్భాలలో తాడే పామై కరుస్తుంది అంటారు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసంతో మూర్ఖంగా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన మెటా, గూగుల్ ఎదుర్కొంటున్నాయి.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొంతకాలంగా గూగుల్, మెటా కంపెనీలు క్రుత్రిమ మేథ సాంకేతికతను విపరీతంగా వాడుకుంటున్నాయి. తాము అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రతి సౌలభ్యాన్ని వీటి ఆధారంగానే తయారు చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు భారీగా తమ అవకాశాలను కోల్పోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పనితీరు సాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్, మెటా కంపెనీలు మనుషులతో అవసరం లేకుండా సాంకేతికత వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దీనివల్ల అవి ఎంత స్థాయిలో లాభాలు పొందుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఏకంగా 56 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
అమెరికాకు చెందిన ఒక న్యాయవాది కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్, మెటా కంపెనీలను ఓడించారు. ఒక కేసులో ఈ రెండు సంస్థలను నేల నాకించారు. ఒక 20 సంవత్సరాల అమ్మాయి కోర్టులో గూగుల్, మెటా కంపెనీలకు వ్యతిరేకంగా కేసు వేసింది. ఈ రెండు కంపెనీల వల్ల తాను సామాజిక మాధ్యమాలకు బానిస అయ్యానంటూ ఆమె వాపోయింది. ఈ కేసు మొదట్లో అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అమెరికా మీడియా మొత్తం ఫోకస్ చేయడంతో ఏకంగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సి వచ్చింది.. ఆ అమ్మాయి కేసును టెక్సాస్ నగరానికి చెందిన లాయర్ మార్క్ లానియర్ వాదించారు. ఈ కేసు విచారణ కోసం ఆయన ఏకంగా నెల వరకు ఏఐ టూల్స్ ఉపయోగించుకున్నారు. ఈ టూల్స్ కోసం ఆయన భారీగానే ఖర్చుపెట్టారు.
ఇక ఈ కేసు విషయానికి వస్తే తనకు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను తెరిచానని చెప్పింది. అందులో ఇన్ఫినిట్ స్క్రోలింగ్ ఉండడంవల్ల తాను వాటికి బానిసలాగా మారిపోయానని చెప్పింది. ఫలితంగా తన బాల్యం.. కౌమార దశలో ప్రశాంతతను కోల్పోయానని పేర్కొంది. ఇదే విషయాన్ని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి ఈ ప్రమాదకరమైన తెలిసినప్పటికీ గూగుల్, మెటా కంపెనీలు యూజర్లను హెచ్చరించడం లేదని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో లాయర్ వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం.. గూగుల్, మెటా కంపెనీలు ఆరు మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని సూచించారు. ఇందులో 70 శాతం మెటా, మిగతా మొత్తాన్ని యూట్యూబ్ చెల్లించాలని ఆయన తీర్పు చెప్పారు. మన కరెన్సీలో ఆ యువతికి 56 కోట్లు లభిస్తాయి.
