Botsa Satyanarayana: ఇటీవల ఏపీ పొలిటికల్ సర్కిల్లో కొత్త అంశం ఒకటి చక్కెర్లు కొడుతోంది. మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్నది దీని సారాంశం. అయితే ఎప్పడూ లేనివిధంగా ఈ కొత్త ప్రశ్న ఎక్కడ నుంచి అనుకుంటున్నారా? అదే ఉపాధ్యాయవర్గాల నుంచి వచ్చిన మాట ఇది. ఇటీవల పాఠశాలల విలీన ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అటు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న 117 జీవోను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కూడా చేపడుతున్నారు. దీనిపై స్పందించి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కస్సుమన్నారు. ఉపాధ్యాయుల తీరును తప్పుపట్టారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాన్న ప్రయత్నంలో భాగంగానే పాఠశాలల విలీన ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుల వ్యవహార శైలిని తప్పుపడుతూ మీ పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మీ వద్ద ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గమన్నాయి. ఎవరికి ఎక్కడ అవకాశముంటే అక్కడ చదువుకుంటారని.. ఉపాధ్యాయుల పిల్లల్లో కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరీ మంత్రి బొత్సతో పాటు ఇతర మంత్రులు, సీఎం జగన్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. మంత్రి బొత్స గురివింద గుంజలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఒక ప్రశ్నకు వంద కౌంటర్లు…
విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తామేమీ హామీలు ఇచ్చి అధికారాలు, అందలాలు, గొంతెమ్మ కోరికలు తీర్చమనడం లేదని అంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలందరూ ప్రైవేటు స్కూళ్లలోనే చదువుకుంటున్నారడంలో అర్థం లేదన్నారు. అది ముమ్మాటికీ పొరపాటేనని చెబుతున్నారు. అలా అనుకుంటే ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం ఎందుకు అమ్మఒడి అందిస్తుందన్నారు. దీని ద్వారా ఎటువంటి సంకేతాలిస్తున్నట్టు అని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ చదువుకున్నా ఇబ్బంది లేదన్న అభిప్రాయం ఉన్నప్పుడు మా పిల్లలను చదివించుకోవడంలోనూ అదే భావన ఉండాలన్నారు. లేనిపోని ఆరోపణలు చేయడం ఏమిటని గురువులు మండిపడుతున్నారు. కేవలం ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇది సహేతుకమా అని ప్రశ్నిస్తున్నారు. తాము కేవలం పాఠశాలల విలీన ప్రక్రయతో వచ్చే ఇబ్బందులను గమనించాలని మాత్రమే కోరుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే కేవలం మంత్రి బొత్స అన్న ఒక మాటతో ఉపాధ్యాయులు 100 ప్రశ్నలతో ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
విమర్శల జడివాన…
జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3,4,5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలను సైతం ఎత్తివేశారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. అయితే దీనిపై విమర్శలు చుట్టుముట్టాయి. దశాబ్దాలుగా గ్రామాల్లో విద్యార్థులతో కళకళలాడే పాఠశాలల్లో సందడి లేకుండా పోయింది. నాడునేడు పథకంలో భాగంగా వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన భవనాలు వృథాగా మారాయి. ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో ప్రజల్లో కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాఠశాలలను ఎత్తివేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం సరైన చర్యేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. మరోవైపు 117 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స వ్యాఖ్యాలతో ఉపాధ్యాయులు భగ్గమన్నారు. దీటైన జవాబు ఇస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Teachers have no right to question education policy botsa satyanarayana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com