BigBoss: కమల్‌హాసన్ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రుతి హాసన్. వరుస చిత్రాలతో దూసుకెళ్లి.. టాప్ హీరోయిన్లలో ఒకరిగా హవా సాగిస్తోంది. కాగా, ఇటీవలే తెలుగులో క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలయ్య సరసన నటించేందుకు సిద్ధమైంది. అనిల్రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది శ్రుతి.
అయితే, ఇప్పుడు విషయం ఏంటంటే.. హీరో కమల్‌హాసన్ తమిళంలో బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం విక్రమ్ సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్లగా.. ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం షూటింగ్ కూడా నిలిపేశారు. ఇటువంటి తరుణంలో బిగ్‌బాస్ పరిస్థితి ఏంటని తమిళ ప్రేక్షకుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, దీనికి షో నిర్వహకులు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది. కమల్ కరోనా నుంచి కోలుకుని వచ్చే వరకు ఆయన స్థానాన్ని శ్రుతి హాసన్ భర్తీ చేయనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తమిళ బిగ్‌బాస్ షోకు శ్రుతి హాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. సింగర్, నటి, ర్యాపర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి.. ఇప్పుడు హోస్ట్‌గా మారి తనలోని టాలెంట్‌ను ఎలా బయటపెట్టబోతుందో తెలియాల్సి ఉంది. అయితే, ఇంకా ఈ విషయంపై శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని టాక్.
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా విక్రమ్. ఇందులో కమల్ విక్రమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కమల్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More