Aus Vs Zim : ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి.. పసికూన జింబాబ్వే సరికొత్త చరిత్ర.. అసీస్ పరువు పాయే!

Aus Vs Zim : ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. గత టీ20 ప్రపంచకప్ ను గెలిచి మరోసారి విజేతగా నిలిచింది. ఇప్పటికే వన్డేల్లో టాప్ జట్టు. అలాంటి జట్టును వారి గడ్డపై ఓడించడం కష్టం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పసికూన జింబాబ్వే. ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. అసీస్ తో జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఏ ఫార్మాట్ లోనైనా ఇదే […]

Written By: NARESH, Updated On : September 3, 2022 4:38 pm
Follow us on

Aus Vs Zim : ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. గత టీ20 ప్రపంచకప్ ను గెలిచి మరోసారి విజేతగా నిలిచింది. ఇప్పటికే వన్డేల్లో టాప్ జట్టు. అలాంటి జట్టును వారి గడ్డపై ఓడించడం కష్టం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పసికూన జింబాబ్వే. ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. అసీస్ తో జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఏ ఫార్మాట్ లోనైనా ఇదే తొలి విజయం కావడం విశేషం.

జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్ లేడు. జట్టును గాయాలు వేధిస్తున్నాయి. పూర్తి స్థాయి జట్టు కూడా లేదు. అయినా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం నిజంగా క్రికెట్ వర్గాల్లో పెను సంచలనమైంది. చివరి వన్డేలో జింబాబ్వే గెలిచినప్పటికీ ఇంతకు ముందు రెండు వన్డేల్లో ఓడించింది. ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను 2- 1 తేడాతో గెలుచుకుంది.

జింబాబ్వే గెలుపునకు ప్రధాన కారణం ఆ టీం బౌలర్ ర్యాన్ బర్ల్ కావడం వివేషం. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసిన ఈ బౌలర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే గెలవడం కష్టమేనని అనుకున్నారు.

కానీ చకబ్వా 37 నాటౌట్ చివరి వరకూ క్రీజులో ఉండి తన జింబాబ్వే జట్టుకు తొలి గెలుపును అందించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ మాత్రమే 94 రన్స్ చేశాడంటే మిగతా బ్యాట్స్ మెన్ అంతా క్యూ కట్టినట్టు అర్థమవుతోంది. ఆసీస్ ను జింబాబ్వే ఓడించడం పట్ల క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతుంది.

జింబాబ్వే కొద్దికాలంగా మెరుగ్గా ఆడుతోంది. జులై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ లో పర్యటించిన జింబాబ్వే 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. ఇక వన్డే సిరీస్ ను 2-1తో గెలిచింది. బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. అనంతరం భారత్ తో ఓడిపోయినా కూడా దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాపై ఓడించి సత్తా చాటింది.