Homeక్రీడలుక్రికెట్‌Aus Vs Zim T20 World Cup: జింబాబ్వే అంటే ఆస్ట్రేలియా కు ఎందుకంత వణుకు!

Aus Vs Zim T20 World Cup: జింబాబ్వే అంటే ఆస్ట్రేలియా కు ఎందుకంత వణుకు!

Aus Vs Zim T20 World Cup: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. అంతగా పట్టించుకోలేదు గాని.. జాతీయ మీడియాలో.. స్పోర్ట్స్ చానల్స్ లో చూస్తుంటే నిజంగా సంచలనమే సంచలనం.

ఇటువంటి వరల్డ్ కప్ లో చిన్న జట్లు సత్తా చూపిస్తున్నాయి. చిన్న జట్ల తాకిడికి ఇబ్బంది పడిన పెద్ద టీంలలో ఇండియా కూడా ఉంది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఒత్తిడి ఎదుర్కొంది. నమీబియా తో జరిగిన మ్యాచ్లో ఇబ్బంది పడింది. అపజయాలు ఎదురు కాకపోయినప్పటికీ.. ఈ రెండు జట్ల మీద టీం ఇండియా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.

అయితే ఆస్ట్రేలియా మాత్రం ఊహించని ఓటమిని పసి కూన లాంటి జింబాబ్వే జట్టు నుంచి ఎదుర్కొంది. ఏకంగా 23 పరుగుల తేడాతో కొలంబోలో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది.

జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం ఇదే తొలిసారి కాదు. అన్ని ఫార్మాట్లో ప్రకారంగా చూసుకుంటే 1983 వరల్డ్ కప్ లో డంకెన్ ఫ్లెచర్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెంట్ బ్రిడ్జి వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

2007 టీ 20 వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేప్ టౌన్ లో జరిగింది. నాడు జింబాబ్వే జట్టుకు సారధిగా కే ప్రోస్పర్ వ్యవహరించాడు.

2014లో హరారేలో జరిగిన మ్యాచ్లో ఎల్డన్ చిగుంబర నాయకత్వంలో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో మూడు వికెట్ల తేడాతో ఓడించింది.

2022లో టౌన్స్ విళ్లే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో ఓడించింది. నాడు జింబాబ్వే జట్టుకు రెగిస్ నాయకత్వం వహించాడు.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఓడించింది. జింబాబ్వే జట్టుకు సికిందర్ రాజా నాయకత్వం వహించాడు.

ఆస్ట్రేలియాపై టి20 పురుషుల ప్రపంచ కప్ లో నూటికి నూరు శాతం విజయాల రికార్డు కలిగి ఉన్న జట్టుగా జింబాబ్వే రికార్డు సృష్టించింది.

2007 కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం సాధించింది. 2026లో కొలంబోలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular