https://oktelugu.com/

Chahal Dhanashree Divorce: యజువేంద్ర చాహల్, ధనశ్రీ విడాకులు.. ఇప్పటివరకు ₹380 కోట్లభరణమే హయ్యెస్ట్ రికార్డ్!

సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఇటీవల పెరిగిపోయింది. శిఖర్ ధావన్- ఆయేషా ముఖర్జీ (Shikhar Dhawan aayesha Mukherjee హార్దిక్ పాండ్యా - నటాషా (Hardik Pandya - Natasha), వీరేంద్ర సెహ్వాగ్ - ఆర్తి (Virendra Sehwag - Aarti).. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ఇప్పుడు ఈ లిస్టులోకి యజువేంద్ర చాహల్ - ధనశ్రీ (Yajuvendra chahal - Dhanashree) కూడా చేరారు.

Written By: , Updated On : February 23, 2025 / 07:38 PM IST
Chahal Dhanashree Divorce

Chahal Dhanashree Divorce

Follow us on

Chahal Dhanashree Divorce: చాహల్- ధనశ్రీ కి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొద్దిరోజుల పాటు ప్రేమించుకున్న అనంతరం వారు కోవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య వారి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు వారిద్దరి మధ్య అన్యోన్యత బాగానే ఉంది. ఇద్దరు తరచూ విహార యాత్రలకు వెళ్లేవారు. దానికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునేవారు.. ధన శ్రీ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. కొన్ని బాలీవుడ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించింది. ఆ తర్వాత డ్యాన్స్ రియాల్టీ షోలలో జడ్జిగా పాల్గొన్నది. కంటెస్టెంట్ గా కూడా సందడి చేసింది. ఇక ఆ మధ్య చాహల్ – ధనశ్రీ ఒక డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు కూడా. ఆ డ్యాన్స్ రియాల్టీ షోలో చాహల్ ను ధనశ్రీ ఎత్తుకున్నది కూడా.

ఏం జరిగిందో తెలియదు..

అనన్యంగా సాగుతున్న వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. మొత్తానికైతే సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు.. తాము విడాకులు తీసుకోబోతున్నామని సంకేతాలిచ్చారు. ఆ తర్వాత తాము విడిగా ఉంటున్నామని చెప్పేశారు. ఈ కార్యక్రమంలో విడిపోవడానికి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు ఫార్మల్టిస్ ప్రకారం కొద్ది రోజులపాటు గడువు విధించింది. ఆ తర్వాత ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించింది. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ.. వారిద్దరు కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు. చివరికి విడిపోవడానికే నిర్ణయించుకోవడంతో బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకుల తర్వాత భరణంగా ధనశ్రీకి చాహల్ 60 కోట్లు ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై చాహల్ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. వైపు సెలబ్రిటీలలో ఇంతవరకు భార్యకు పెద్ద మొత్తంలో భరణం ఇచ్చిన వ్యక్తిగా హృతిక్ రోషన్ నిలిచాడు. తన భార్య సుసానే కు 380 కోట్లు భరణంగా ఇచ్చాడు.. అయితే ఇప్పుడు చాహల్ ధనశ్రీకి 60 కోట్లు ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై యజువేంద్ర చాహల్ అధికారికంగా ప్రకటన చేస్తేనే ఒక స్పష్టత వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.