https://oktelugu.com/

Nara Lokesh: ఛాంపియన్స్ ట్రోఫీలో నారా లోకేష్.. వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే?

సహజంగా భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఐసీసీ నుంచి సామాన్య పౌరుల వరకు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ను టెన్త్ ఆసక్తిగా చూస్తుంటారు.. అందువల్లే క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే పోరును హైఓల్టేజ్ గా పేర్కొంటారు.

Written By: , Updated On : February 23, 2025 / 07:55 PM IST
Nara Lokesh

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అబుదాబి వేదికగా భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలవడం.. సుదీర్ఘకాలం తర్వాత ఛాంపియన్ ట్రోఫీ జరగడం.. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని గట్టి పట్టుదలతో ఉండడంతో.. భారత్ పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

సహజంగా భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఐసీసీ నుంచి సామాన్య పౌరుల వరకు భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ను టెన్త్ ఆసక్తిగా చూస్తుంటారు.. అందువల్లే క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే పోరును హైఓల్టేజ్ గా పేర్కొంటారు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాకిస్తాన్ తల పడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ మ్యాచ్ చూసేందుకు మన దేశం నుంచి సెలబ్రిటీలు అబుదాబి వెళ్లిపోయారు. ఇందులో చిరంజీవి నుంచి మొదలు పెడితే నారా లోకేష్ వరకు ఉన్నారు. అయితే నారా లోకేష్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని, దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. నారా లోకేష్ తన కుమారుడితో జాతీయ జెండాను పట్టుకున్న ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.. టీమిడియా గెలవాలని కామెంట్ చేశారు. అయితే దీనిని వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేయడం మొదలుపెట్టాయి.

కారణం ఏంటంటే..

ఏపీలో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు వైసిపి నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. సాక్షి గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను ప్రముఖంగా చూపించడం మొదలు పెట్టింది. ఇక నారా లోకేష్ అబుదాబిలో ఉన్నట్టు.. టీమిండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోటీని ఆసక్తిగా చూస్తున్నట్టు ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు మండిపడటం మొదలుపెట్టాయి. గ్రూప్ -2 అభ్యర్థులు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తుంటే.. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతుంటే.. బాధ్యత ఉన్న విద్యాశాఖ మంత్రిగా విదేశాలకు వెళ్తావా అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి వైసిపి శ్రేణులు విమర్శిస్తున్నాయి. ” గ్రూప్ -2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ మాత్రం వారిపై ఉక్కు పాదం మోపుతోంది.. మరోవైపు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా అర్ధరాత్రి గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడేమో ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు నరకం చూస్తున్నారు. ఇన్ని రోజులపాటు పరీక్షకు ప్రిపేర్ అయినవారు ప్రభుత్వ తీరు వల్ల ఆందోళన చెందుతున్నారు. పరీక్ష నిర్వహించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వానికి తెలియాలని” వైసిపి నాయకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులకు టిడిపి నాయకులు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నిరుద్యోగ యువతకు నారా లోకేష్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇన్ని రోజులు ఎదురుచూసినవారు.. ఇప్పుడు పరీక్ష రాస్తే ఇబ్బంది ఏంటని.. వైసిపి నాయకుల ట్రాప్ లో గ్రూప్ 2 అభ్యర్థులు పడ్డారని.. ఇలాంటి తీరు సరికాదని.. టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. వైసిపి నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించకుండా చూస్తున్నారని మండిపడుతున్నారు.